Ambaji Mandir: అంబాజీ మాత జాతరకు కాలినడక వెళ్తోన్న భక్తులను ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి, ఏడుగురు పరిస్థితి విషమం

|

Sep 02, 2022 | 9:43 AM

ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటి అంబాజీ మాత ఆలయం. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంబాజీలో సెప్టెంబర్ 5 నుంచి ఆరు రోజుల పాటు భదర్వి పూనం జాతర నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10 వరకు జాతర కొనసాగనుంది.

Ambaji Mandir: అంబాజీ మాత జాతరకు కాలినడక వెళ్తోన్న భక్తులను ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి, ఏడుగురు పరిస్థితి విషమం
Ambaji Road Accident
Follow us on

Ambaji Mandir: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరావళి జిల్లాలోని బనస్కాంతలోని అంబాజీ మాతను దర్శించుకునేందుకు వెళ్తున్నభక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమ్మవారి జాతరకు వెళ్తోన్న భక్తులను ఓ కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది పంచమహల్ వాసులే. వీరంతా ప్రసిద్ధ శక్తిపీఠం అంబాజీ మాత ఆలయాన్ని సందర్శించేందుకు కాలినడకన వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు భక్తులను ఢీకొన్నది.

ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటి అంబాజీ మాత ఆలయం. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంబాజీలో సెప్టెంబర్ 5 నుంచి ఆరు రోజుల పాటు భదర్వి పూనం జాతర నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10 వరకు జాతర కొనసాగనుంది. దీంతో అంబాజీకి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. బనస్కాంత జిల్లా యంత్రాంగం,అరసూరి అంబాజీ మాత దేవస్థాన్ ట్రస్ట్ గత కొన్ని రోజులుగా జాతర కోసం సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి


విగ్రహం లేని ఆలయం: 
అంబాజీ ఆలయంలో దేవత విగ్రహం లేదా చిత్రం ఉండదు. సతీదేవి హృదయం పడిన ఈ ప్రాంతంలో విగ్రహం బదులు బీజాక్షరాలు రాసిన ఓ యంత్రం ఇక్కడ పూజలను అందుకుంటుంది. ఈ యంత్రాన్ని నేరుగా భక్తులు చూడలేదు.. కంటికి తెల్లటి వస్త్రాన్ని కట్టుకుని దర్శించుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..