INS Vikrant: మరి కాసేపట్లో ఫస్ట్ స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్‌ను జాతికి అంకిత మివ్వనున్న ప్రధాని మోడీ.. దీని స్పెషలిస్ట్ ఏమిటంటే

ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింప బడిన మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక. తాజా ఆవిష్కరణతో ప్రపంచంలో ఈ మైలురాయిని సాధించిన ఆరో దేశంగా భారత్‌ అవతరించింది.

INS Vikrant: మరి కాసేపట్లో ఫస్ట్ స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్‌ను జాతికి అంకిత మివ్వనున్న ప్రధాని మోడీ.. దీని స్పెషలిస్ట్ ఏమిటంటే
Pm Modi Ins Vikrant
Follow us

|

Updated on: Sep 02, 2022 | 8:45 AM

INS Vikrant 2022:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాదళానికి అంకితం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మో ఉదయం 9.30 గంటలకు కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ ని ప్రధాని జాతికి అంకితం ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు మంగళూరులో దాదాపు 3800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం చేయనున్నారు. అంతేకాదు కేరళ పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింప బడిన మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక. తాజా ఆవిష్కరణతో ప్రపంచంలో ఈ మైలురాయిని సాధించిన ఆరో దేశంగా భారత్‌ అవతరించింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను మోహరించడం వల్ల హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, భద్రత మరియు స్థిరత్వం పెరుగుతాయని భారత నౌకాదళ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ స్వదేశీ విమాన వాహక నౌక పొడవు, వెడల్పు రెండున్నర హాకీ ఫీల్డ్‌లకు సమానం. ఈ విమాన వాహన నౌక విధులను నిర్వహించడానికి రంగంలోకి దిగిన నేపథ్యంలో దేశ భద్రతను మరింత బలోపేతంమవుతుంది.

262 మీటర్ల వెడల్పు, 45 వేల టన్నుల బరువు విశేషమేమిటంటే.. భారతదేశపు మొదటి యుద్ధనౌకకు  INS విక్రాంత్ పేరు పెట్టారు. 1971 యుద్ధంలో విక్రాంత్ ముఖ్యమైన పాత్ర పోషించారు. భారత నౌకాదళం ప్రకారం.. INS విక్రాంత్ పొడవు 262 మీటర్లు, బరువు సుమారు 45 వేల టన్నులు. ఇది భారతదేశంలోని ఇప్పటి వరకూ ఉన్న అన్ని యుద్ధనౌకల కంటే ఎక్కువ పొడవైనది.

ఇవి కూడా చదవండి

ఏకకాలంలో 30 విమానాలను తీసుకెళ్లగల సామర్థ్యం వైస్ అడ్మిరల్ హెంపిహోలీ ఐఎన్‌ఎస్ విక్రాంత్ విశేషాలను వివరిస్తూ.. ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఏకకాలంలో మొత్తం 30 విమానాలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాదు మిగ్ 29కె యుద్ధ విమానం కూడా ఎగురగలదు. ఈ కమోవ్ 31 ఎయిర్ వార్నింగ్ హెలికాప్టర్ కూడా ఆపరేట్ చేయగలదని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..