Venkaiah Naidu: పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

|

Apr 22, 2024 | 8:08 PM

దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. కేంద్రం ఈ ఏడాది ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వారిలో 67 మందికి ఈ రోజు అవార్డులు అందించారు. మిగిలిన అవార్డులను వచ్చే వారం ప్రదానం చేసే అవకాశం ఉంది.

Venkaiah Naidu: పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
Padma Awards
Follow us on

దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. కేంద్రం ఈ ఏడాది ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వారిలో 67 మందికి ఈ రోజు అవార్డులు అందించారు. మిగిలిన అవార్డులను వచ్చే వారం ప్రదానం చేసే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు..భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

46 ఏళ్ల రాజకీయ జీవితంలో..

75 ఏళ్ల వెంకయ్యనాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్నహోదాల్లో పనిచేశారు. 2017 నుంచి 2022 మధ్యకాలంలో భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్యనాయుడు.. వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగానూ పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2002 నుంచి 2004 వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ సేవలందించారు.

వెంకయ్య నాయుడుతోపాటు సులభ్‌ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్‌ పాఠక్‌ బదులు ఆయన సతీమణి అమోలా పాఠక్ అవార్డును స్వీకరించారు. నటుడు మిథున్ చక్రవర్తి, కేంద్ర మాజీమంత్రి రామ్ నాయక్, గాయని ఉషా ఉథుప్‌ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. క్రీడాకారుడు రోహన్ బోపన్న సహా పలువురు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..