Triple Talaq: సిల్లీ రీజన్‌తో భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. ఎక్కడంటే..

|

Nov 01, 2022 | 3:56 PM

తన భర్త తన చికిత్సకు అయ్యే ఖర్చు భరించాలని కోరుకుంది.. దీంతో  ఆ మహిళ తన చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం ఫోన్‌లో కొంత డబ్బు డిమాండ్ చేసింది. తన భార్య డబ్బులు అడగడం ఆ భర్త భరించలేకపోయాడు.. కోపంతో వెంటనే ఫోన్ లోనే ట్రిపుల్ తలాక్ చెప్పి మహిళకు సదరు భర్త విడాకులు ఇచ్చాడు.

Triple Talaq: సిల్లీ రీజన్‌తో భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. ఎక్కడంటే..
Triple Talaq
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసిన మరోసారి ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. అస్వస్థతకు గురైన మహిళ వైద్యం కోసం డబ్బులు అడిగిందని ఆగ్రహం చెందిన భర్త ఫోన్ లోనే ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చాడు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వెంటనే ఆ మహిళ సృహతప్పి నెల మీద పడిపోయింది. దీంతో కుటుంబంలో కలకలం రేగింది. కుటుంబ సభ్యులు తన భర్త విడాకులు ఇచ్చిన విషయం చెప్పడంతో..  కుటుంబసభ్యులందరిలో తీవ్ర విషాదం నెలకొంది. అదే సమయంలో బాధిత మహిళ ఇప్పుడు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని  వేడుకుంటుంది.

గుర్సాహైగంజ్ కొత్వాలి ప్రాంతంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బాధితురాలు న్యాయం కోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఆశ్రయించింది. తమకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. అత్తమామలు మనవడు కావాలని కోరుకుంటున్నట్లు సదర బాధిత మహిళ తెలిపింది. కుమార్తెలు పుట్టిన తర్వాత బాధితురాలికి అంతర్గతంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడడంతో గత కాలంగా చికిత్స కొనసాగుతుంది.

బాధిత మహిళ చికిత్స నిమిత్తం తన పుట్టింట్లో తల్లిదండ్రుల దగ్గర నివసిస్తోంది. చికిత్స కోసం అధికంగా డబ్బులు ఖర్చు అవుతుంది. ఓ వైపు బాధిత మహిళ తల్లిదండ్రులు కూడా సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు. అయితే తన భర్త తన చికిత్సకు అయ్యే ఖర్చు భరించాలని కోరుకుంది.. దీంతో  ఆ మహిళ తన చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం ఫోన్‌లో కొంత డబ్బు డిమాండ్ చేసింది. తన భార్య డబ్బులు అడగడం ఆ భర్త భరించలేకపోయాడు.. కోపంతో వెంటనే ఫోన్ లోనే ట్రిపుల్ తలాక్ చెప్పి మహిళకు సదరు భర్త విడాకులు ఇచ్చాడు. తన భర్త ఇచ్చిన ట్రిపుల్ తలాక్ రికార్డు కూడా తన ఫోన్‌లో రికార్డ్ అయిందని బాధిత మహిళ ఆరోపించింది. అయితే బాధిత మహిళ ఏడుస్తూ అత్తమామల ఇంటికి చేరుకోవడంతో అక్కడ ఉన్న అత్తమామలు ఆమెను కొట్టి, మొబైల్ లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేసింది బాధిత మహిళ.

ఇవి కూడా చదవండి

తమ కూతుర్ని అత్తమామలు చాలా కాలంగా వేధిస్తున్నారని మహిళ కుటుంబ సభ్యులు తెలిపారు.  మీ భార్యకి విడాకులు ఇస్తే.. మళ్లీ పెళ్లి చేసుకుని జీవితాన్ని చక్కగా గడపవచ్చని  అత్తమామలు తమ కొడుక్కి చెబుతున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.  తనకు న్యాయం చేయమని నిత్యం ఔట్‌పోస్టు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా వినడం లేదని బాధితురాలు తెలిపింది. దేశంలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టం చేయబడింది. అయితే అది సరిగ్గా అమలు కావడం లేదు. దీని కారణంగా ముస్లిం సమాజంలోని మేము ఇప్పటికీ ఈ ట్రిపుల్ తలాక్ పై పోరాడుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..