నీట్-యూజీ పేపర్ లీక్‌పై విపక్షాలది మొసలి కన్నీరు.. మండిపడ్డ ధర్మేంద్ర ప్రధాన్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజ్ అంశంపై రాహుల్ గాంధీ, విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే..

నీట్-యూజీ పేపర్ లీక్‌పై విపక్షాలది మొసలి కన్నీరు.. మండిపడ్డ ధర్మేంద్ర ప్రధాన్
Education Minister Dharmendra Pradhan
Follow us

|

Updated on: Jul 22, 2024 | 10:46 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజ్ అంశంపై రాహుల్ గాంధీ, విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే.. గత యూపీఏ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌లోని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు సంబంధించి గ్రౌండ్ లెవల్ విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. లోక్‌సభ వేదికగా నీట్-యూజీకి సంబంధించిన వివాదంపై సోమవారం విపక్షాలు.. అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి.

పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు దాడి చేశాయి. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ”దేశంలో పరీక్షా విధానంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని.. ఇక ఈ అంశంపై తనను తప్ప.. ఇతరులను నిందిస్తున్నారంటూ” కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యాసంస్థల్లో అన్యాయమైన పద్ధతులను నిరోధించేందుకు ఎందుకని చర్యలు తీసుకోలేదు.? అన్యాయమైన పద్ధతుల నిషేధ బిల్లు, 2010ను కూడా నిరోధించడంలో ఎందుకు విఫలమైందని.? కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ మండిపడ్డారు. ఈ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ తన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు.

అక్రమ పద్ధతుల నిషేధ బిల్లు-2010తో సహా విద్యా సంస్థల్లో అన్యాయమైన పద్ధతులను నిరోధించేందుకు సంబంధించిన బిల్లులను అమలు చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్ వివరించాలి. ఏయే కారణాల వల్ల అక్రమాలను అరికట్టేందుకు ఉపయోగపడే ఈ చట్టాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిరాకరించిందో ప్రతిపక్ష నేత చెప్పగలరా? అలాగే గత ఏడేళ్లలో పేపర్ లీకేజీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. నీట్‌-యూజీకి సంబంధించి అవకతవకలు జరిగాయన్న అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని, ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తామని రాహుల్ గాంధీ అంతకుముందు చెప్పిన సంగతి తెలిసిందే.

బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!