Delhi Excise Policy Case: లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించేనా? తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు

|

Apr 03, 2024 | 8:16 PM

లిక్కర్‌ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పూర్తయింది. మార్చి 22న ట్రయల్‌కోర్టులో తన అరెస్ట్‌, రిమాండ్‌ నిర్ణయాన్ని కేజ్రీవాల్‌ సవాలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేజ్రీవాల్ తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ..

Delhi Excise Policy Case: లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించేనా? తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు
Delhi Excise Policy Case
Follow us on

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: లిక్కర్‌ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పూర్తయింది. మార్చి 22న ట్రయల్‌కోర్టులో తన అరెస్ట్‌, రిమాండ్‌ నిర్ణయాన్ని కేజ్రీవాల్‌ సవాలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేజ్రీవాల్ తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ.. ED అరెస్టుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. విచారణ సందర్భంగా సింఘ్వీ ఈ ప్రశ్నలను లేవనెత్తారు. అరెస్టు సమయం, అరెస్టుకు సంబంధించిన ఆధారాలు, ఎన్నికలను నిలిపివేసేందుకు యత్నం, అరెస్టు ద్వారా అవమానించే ప్రయత్నం, అరెస్ట్‌లో పీఎంఎల్‌ఏ సెక్షన్ల కింద ఉన్న విధానాన్ని అనుసరించలేదు వంటి విషయాలను ఆయన లేవనెత్తారు.

కేజ్రీవాల్ విషయంలో ED ఎందుకు డైలమాలో ఉంది?

ఈడీ తరఫున ఏఎస్జీ ఎస్వీ రాజు వాదిస్తూ.. తాను కాస్త డైలమాలో ఉన్నానని చెప్పారు. ఈ పిటీషన్‌ బెయిల్‌ దరఖాస్తు అని, అరెస్టును రద్దు చేయాలనే పిటిషన్‌ కాదని ఆయన వాదించారు. మేము ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొన్ని ఆస్తులను అటాచ్ చేయాలనుకుంటున్నామని ASG తెలిపారు. ఇలా చేస్తే ఎన్నికల వేళ ఇదంతా చేశాం అంటున్నారు. ఇలా చేయకుంటే సాక్ష్యం ఎక్కడుందో చెప్పమని అడుగుతారు. కాబట్టి నేను కొంచెం గందరగోళంగా ఉన్నాను. అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వస్తే.. ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది.

కేజ్రీవాల్‌పై మనీలాండరింగ్ కేసు: ASG

ఈ ఐదు కాగ్నిజెన్స్ ఆర్డర్‌లను సవాలు చేయలేదని లేదా రద్దు చేయలేదని మునుపటి ఉత్తర్వులను ఉటంకిస్తూ ASG SV రాజు తెలిపారు. పీఎంఎల్‌ఏలోని సెక్షన్ 45ను ఉటంకిస్తూ ఏఎస్‌జీ రాజు మాట్లాడుతూ.. ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పెద్ద సంఖ్యలో నిందితులకు బెయిల్ నిరాకరించారనేది నా వాదన అని అన్నారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ తిరస్కరణకు గురైతే, మనీలాండరింగ్ కేసు ప్రాథమికంగా బయటపడిందని అర్థం. ఇది మాత్రమే కాదు.. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఉదహరిస్తూ, సుప్రీంకోర్టులో కూడా బెయిల్ మంజూరు చేయలేదని ASG అన్నారు. దీనర్థం ప్రాథమికంగా కేసు బయటపడింది. ASG ఇంకా మాట్లాడుతూ నా ఇంట్లో ఏమీ దొరకలేదు అనే ప్రశ్న ఎక్కడ ఉంది? మీరు గోవా ఎన్నికల్లో డబ్బును ఉపయోగించారు. డబ్బు ఎక్కడిదని ED మిమ్మల్ని అడిగినప్పుడు? నాకు తెలియదని మీరు సమాధానం చెబుతున్నారు. అయితే ఆ డబ్బు వేరే వారికి ఇస్తే.. వాళ్లు మీ ఇంటి నుంచి ఎలా తెస్తారని ఏఎస్జీ అన్నారు. ఈ మొత్తం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యక్తిగతంగానూ, పరోక్షంగానూ ప్రమేయం ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి

విచారణ సందర్భంగా సింఘ్వీ, ఏఎస్జీ మధ్య వాగ్వాదం

అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కౌంటర్ ఇస్తూ.. నా పిటిషన్ గురించి నా స్నేహితుడు (ఏఎస్‌జీ) చెప్పలేదని అన్నారు. PMLA సెక్షన్ 19 కింద అక్రమ అరెస్టును మా పిటిషన్ సవాలు చేస్తోంది. తప్పుగా సూచించడం ద్వారా మీరు పిటిషన్‌ను అనవసరంగా చూపించాలనుకుంటున్నారు అని అన్నారు. దీనిపై ఏఎస్జీ మాట్లాడుతూ.. మీరు నా వాదనలను అర్థం చేసుకోలేకపోతున్నారని, కొన్ని వాదనలు అర్థం కావడం లేదని సింఘ్వీ కౌంటర్ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలను నేను అర్థం చేసుకోగలిగినంత వరకు అంతా బాగానే ఉందని కోర్టు పేర్కొంది.

మనీష్ సిసోడియాకు బెయిల్ రానందున అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సవాల్ చేయడం చట్టబద్ధం కాదని సింఘ్వీ చెప్పడం సరికాదన్నారు. ఈ కుంభకోణం చాలా కాలం క్రితమే వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. అయితే ఎన్నికల మధ్యలో ఎందుకు అరెస్టులు చేశారని సింఘ్వీ ప్రశ్నించారు. ఆగస్టు 2022, అక్టోబర్ 2023 ఈ రెండు సందర్భాల్లో ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. మరోవైపు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు తగినది కాదని పేర్కొంది. దీంతో పాటు సీఎం కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ పలు ఆరోపణలు చేసింది. ఈడీ తన అఫిడవిట్‌లో కేజ్రీవాల్‌ను ప్రధాన కుట్రదారుగా అభివర్ణించింది. కేజ్రీవాల్ ద్వారా మనీలాండరింగ్ నేరానికి ఆమ్ ఆద్మీ పార్టీ పాల్పడిందని దర్యాప్తు సంస్థ చెబుతోంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు రూ.45 కోట్లు ఖర్చు చేసింది. ఈ కుంభకోణంపై ఢిల్లీ సీఎంకు పూర్తి అవగాహన ఉందని, ఇది కేజ్రీవాల్ నేరమని దర్యాప్తు సంస్థ చెబుతోంది. కాగా, అఫిడవిట్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ.. ఈడీ అబద్ధం చెబుతోందని ఆరోపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

కాగా ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఏప్రిల్ 15 వరకు కేజ్రీవాల్ జైలులోనే ఉంటారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఆయనను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపించగా.. రిమాండ్‌ను మరో నాలుగు రోజులు పొడిగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.