India Covid-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో..

India Corona cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. తాజాగా కేసుల సంఖ్య

India Covid-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో..
Corona Cases Inindia
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 20, 2021 | 10:45 AM

India Corona cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. తాజాగా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారంతో పోల్చుకుంటే దాదాపు 8 వేల వరకు కేసులు తగ్గాయి. గత 24గంటల వ్యవధిలో కొత్తగా 30,093 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 374 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,74,322 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,14,482 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నాలుగు నెలల తర్వాత కేసులు, మరణాల సంఖ్య నిన్న తక్కువగా నమోదైంది. చివరిసారిగా మార్చి 17న 28,903 కేసులు నమోదయ్యాయి.

సోమవారం కరోనా నుంచి 45,254 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,03,53,710కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,06,130 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.32శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 41 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి మంగళవారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 41,18,46,401 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Onion Benefits: ఉల్లిపాయ చేసే మేలు తెలిస్తే షాకవుతారు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

TS Registration Charges: మరో కీలక నిర్ణయం.. తెలంగాణలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంపు..!