Cong prez poll: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోంచి మరొకరు ఔట్.. ఫైనల్‌గా వారిద్దరే..

|

Oct 01, 2022 | 4:25 PM

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఖర్గే వర్సెస్‌ థరూర్‌ అన్నట్లుగా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఈ ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నిలిచారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠి

Cong prez poll: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోంచి మరొకరు ఔట్.. ఫైనల్‌గా వారిద్దరే..
Kn Tripathi
Follow us on

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఖర్గే వర్సెస్‌ థరూర్‌ అన్నట్లుగా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఈ ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నిలిచారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠి వేసిన నామినేషన్‌ను తిరస్కరించారు ఎన్నికల ఇంచార్జ్‌ మధుసూధన్‌ మిస్త్రీ. దాంతో పోటీలో థరూర్, ఖర్గే మాత్రమే మిగిలారు. ఈనెల 8 వరకు నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ ఎన్నికల ఇంచార్జ్‌ మధుసూధన్‌ మిస్త్రీ ప్రకటించారు. కేఎన్‌ త్రిపాఠి దాఖలు చేసిన పత్రాలు సరిగ్గా లేవని, అందుకే తిరస్కరించినట్టు మిస్త్రీ తెలిపారు.

ఇదిలాఉంటే.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి బరిలో ఉన్న మల్లిఖార్జున్‌ ఖర్గే రాజ్యసభలో విపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన సోనియాగాంధీకి పంపించారు. ఒక వ్యక్తి.. ఒకే పదవి రూల్‌ ప్రకారం తాను రాజ్యసభ పదవి నుంచి వైదొలుతున్నట్టు ఖర్గే తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన శశిథరూర్‌తో తలపడుతున్నారు. ఇకపోతే ఖర్గే రాజీనామాతో రాజ్యసభలో విపక్ష నేత పదవికి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు చిదంబరం పోటీ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మార్పు కావాలంటే నాకే ఓటేయండి..

ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకత్వం కొనసాగుతున్న తీరు నచ్చితే ఖర్గేకు అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయవచ్చన్నారు శశిథరూర్‌. కాంగ్రెస్‌ పార్టీలో మార్పును కోరుకుంటున్న వాళ్లు తనకు ఓటేయ్యాలని పిలుపినిచ్చారు. ఇది సైద్దాంతిక పోరాటం కాదని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..