లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సింప్లిసిటీని చాటుకున్నారు. ఢిల్లీలోని ఓ హెయిర్ సెలూన్‌కు వెళ్లారు. బార్బర్ అజిత్‌తో మాట్లాడి అతడి సాధకబాధకాలు, కలలు, ఆశయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, అతనితో ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో, రాహుల్ సెలూన్‌లో ఒక బార్బర్‌తో మాట్లాడుతూ, షేవింగ్ చేసుకుంటూ కనిపించాడు. రాహుల్ గాంధీ ఈ వీడియోను పోస్ట్ చేసి ఏమీ మిగలలేదు అని రాశారు!
అజిత్ అనే బార్బర్ ఈ సెలూన్‌ను నడుపుతున్నారు. బార్బర్ అజిత్ రాహుల్‌కు రోజంతా ఎలా పనిచేస్తాడో చెప్పాడు. నెలకు 15వేలు సంపాదిస్తున్నానని రాహుల్ గాంధీకి బార్బర్ అజిత్ చెప్పాడు. ఒక వ్యక్తి 15,000ల్లో ఏం ఆదా చేస్తాడు, ఏమీ మిగలదు కదా అని రాహుల్ అడగగా.. ఇల్లు గడవడానికి, షాప్ రెంట్‌కే సరిపోతున్నాయని అజిత్ చెప్పాడు. ఎంతో కష్టపడి పని చేస్తున్నాను. కానీ మేము ఇంకా ఇక్కడే ఉన్నామని అజిత్ బదులిచ్చారు. తన భార్య హార్ట్ పేషెంట్ అని అతడు వాపోయాడు. తనకు మిగిలిందేమీ లేదంటూ ఆ బార్బర్ కన్నీరు పెట్టుకున్నాడు బార్బర్. షాప్ నుంచి బయటకు వెళ్లే ముందు బార్బర్ అజిత్‌ను రాహుల్ గాంధీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. దీంతో అజిత్ ఒక్కసారిగా కన్నీళ్లు చెమర్చాడు.
అనంతరం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ, రాహుల్ ఇలా వ్రాశాడు, “ఏమీ మిగిలి లేదు! అజిత్ భాయ్ ఈ నాలుగు మాటలు, అతని కన్నీళ్లు ఈ రోజు భారతదేశంలోని ప్రతి శ్రామిక పేద, మధ్య తరగతి వ్యక్తి కథను చెబుతున్నాయి. మంగలి నుండి చెప్పులు కుట్టేవాడు, కుమ్మరి వరకు. వడ్రంగి నుండి వంటవారి వరకు – తగ్గుతున్న ఆదాయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మాన్యువల్ కార్మికుల కలలను, వారి స్వంత దుకాణాలు, గృహాలు, ఆత్మగౌరవాన్ని కూడా దూరం చేశాయి.” అంటూ రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
आज नेता विपक्ष श्री @RahulGandhi ने दिल्ली में अजीत जी की दुकान पर शेविंग करवाई और उनके जीवन के संघर्ष को करीब से समझा।
नाई से लेकर मोची, कुम्हार से लेकर बढ़ई – घटती आमदनी और बढ़ती महंगाई ने सभी के स्वाभिमान और अरमान छीन लिए हैं।
हमें साथ मिलकर एक ऐसे समाज का निर्माण करना है,… pic.twitter.com/MTWfbnMrsl
— Congress (@INCIndia) October 25, 2024
ఇంతకుముందు కూడా రాయ్‌బరేలీలోని బార్బర్ షాప్‌లో జుట్టు కత్తిరించుకున్నారు రాహుల్ గాంధీ. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని ఒక బార్బర్ షాప్‌కు జుట్టు కత్తిరించి, షేవింగ్ చేయించుకున్నారు. అక్కడ బార్బర్ పని గంటల గురించి, అతని నైపుణ్యం ఎక్కడ నేర్చుకున్నాడనిబార్బర్‌ని అడిగి తెలుసుకున్నారు.
ఇక ఇటీవల మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో దళిత కుటుంబం ఇంట్లో వంట చేశారు రాహుల్. వంటకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ, నేటికీ దళితుల వంటగది గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దళితులు ఏం తింటారో, ఎలా వండుతారో ఎవరికీ తెలియదు. మేము దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యతగా భావిస్తామన్నారు. ఆగస్టులో రాహుల్ గాంధీ సుల్తాన్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. తిరిగి వస్తుండగా చెప్పులు కుట్టే దుకాణం కనిపించి ఆగారు. రాహుల్ అక్కడ చెప్పులు కుట్టించుకున్నారు. చెప్పులు కుట్టే వ్యక్తిని బూట్లు ఎలా తయారు చేయాలో అడిగాడు. దాదాపు 5 నిమిషాల పాటు మాట్లాడిన అనంతరం రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..