CJI Ramana in Telugu: ఆమె కోసం తెలుగులోనే CJI జస్టిస్ రమణ విచారణ.. సుప్రీంకోర్టులో ఓ అరుదైన దృశ్యం

|

Jul 29, 2021 | 8:57 AM

సుప్రీంకోర్టులో ఆంగ్ల భాషలో వాదనలు వినిపించేందుకు ఇబ్బంది పడుతున్న ఓ మహిళ కోసం అరుదైన నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ. తన మాతృ భాష తెలుగులోనే వారి వాదలను...

CJI Ramana in Telugu: ఆమె కోసం తెలుగులోనే CJI జస్టిస్ రమణ విచారణ.. సుప్రీంకోర్టులో ఓ అరుదైన దృశ్యం
Cji Justice N.v. Ramana
Follow us on

అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో తెలుగులో వాదనలు వినిపించాయి. ఓ కేసు విచారణను హింది, ఇంగ్లీష్ ఉపయోగించాల్సిన సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దారుకు అనుగుణంగా చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ సూచనతో తెలుగులోనే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే.. సుప్రీం కోర్టులో వాదనలు ఎక్కువగా జాతీయ బాష హిందిలోనే కొనసాగుతాయి. అలా కాకుంటే ఇంగ్లీష్‌లో వాదనలు ఉంటాయి.  ఏకంగా సుప్రీం కోర్టులోనే భార్యాభర్తల సమస్యకు పరిష్కారం చూపించారు. విడిపోతున్న ఆ ఇద్దరినీ ఒక్కటి చేశారు. బుధవారం సుప్రీం కోర్టులో ఓ అరుదైన సంఘటన ఆవిష్కృతమైంది. చిన్న.. చిన్న పొరపొచ్చలు.. మనస్పర్థల కారణంతో  20 ఏళ్లుగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలను ఒకటి ఆయన కలిపారు.

సుప్రీంకోర్టులో ఆంగ్ల భాషలో వాదనలు వినిపించేందుకు ఇబ్బంది పడుతున్న ఓ మహిళ కోసం అరుదైన నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ. తన మాతృ భాష తెలుగులోనే వారి వాదలను విని మరీ భార్యాభర్తలను ఒప్పించి కలిసి ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా గురజాల డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాసశర్మ, శాంతిలకు 1998లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 1999లో ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఆ తర్వాత మాటా.. మాట పెరిగి గొడవల కారణంగా మారాయి. ఇలా వారిద్దరూ 2001 నుంచి విడిపోయారు.

అయితే తనపై భర్త శ్రీనివాసశర్మ దాడి చేశారంటూ అప్పట్లో శాంతి పోలీసులను ఆశ్రయించారు. దీంతో శ్రీనివాసశర్మపై సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గుంటూరులోని 6వ అడిషనల్ మున్సిప్ మెజిస్టేట్ కోర్టు శ్రీనివాసశర్మకు ఏడాది జైలు శిక్ష, రూ.1,000 ఫైన్ విధించింది. అయితే శ్రీనివాసశర్మ హైకోర్టును ఆశ్రయించడంతో 2010 అక్టోబర్ 6న శిక్ష తగ్గిస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు తీర్పును శాంతి సుప్రీం కోర్టులో 2011లో సవాల్ చేశారు. దీంతో ఈ కేసుపై CJI జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం ఆన్‌లైన్‌లో విచారించారు. భార్యభర్తలకు సవివరంగా నచ్చజెప్పారు.. ఇలా వారిని మరోసారి ఒక్కటి చేశారు.

మాతృ భాషలో..

నిజానికి సుప్రీం కోర్టు స్థాయిలో కక్షిదారులను కోర్టుకు పిలవరు. వారి తరఫు న్యాయవాదులే వాదిస్తుంటారు. అయితే, ఇక్కడే జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సుదీర్ఘ కాలంగా దూరంగా ఉన్న భార్యాభర్తల మనోగతాన్ని స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వారిద్దరూ కలిసి జీవితంలో ముందుకు సాగేలా వారికి సర్ధి చెప్పారు. బాధితులు తెలుగులో వారి మనోవేదనలను తెలిపారు.

తెలుగును ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి..

బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో వివాహానికి సంబంధించిన ఓ కేసు విచారణకు వచ్చింది. కక్షిదారు అయిన ఓ మహిళ తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే ఆంగ్లంలో మాట్లాడేందుకు ఆమె ఇబ్బంది పడుతున్నారని.. జస్టిస్ రమణ అర్థం చేసుకున్నారు. తన వాదనల్ని తెలుగులోని వినిపించాలని సూచించారు. ఆమె చెప్పిన విషయాన్ని ఆంగ్లంలోకి అనువదించి, తన సహచర న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వివరించారు జస్టిస్ రమణ. జస్టిస్ ఎన్వీ రమణ ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి వివరించడం హైలెట్‌గా చెప్పుకోవచ్చు.

మాతృ భాషపై గౌరవం..

జస్టిస్ ఎన్​.వి.రమణకు మాతృభాషపై మమకారం ఎక్కువ. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించాలని అనేక సందర్భాల్లో ఆయన అన్నారు.  ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలని, న్యాయస్థానాల్లో తెలుగును ప్రోత్సహించాలనేది జస్టిస్‌ రమణ అభిలాష.

ఇవి కూడా చదవండి: Marine Srinivas: మిస్టరిగా మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..

Jhunjhunwala New Plan: బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొత్త ప్లాన్.. సామాన్యుల కోసం ప్రత్యక్ష వ్యాపారంలోకి..