కిక్కిరిసిన ఆస్పత్రులు.. కిటకిటలాడుతున్న పిల్లల వార్డులు.. అత్యవసర విభాగంలో వృద్ధుల ఆర్తనాదాలు. ఇది చైనాలోని పరిస్థితి. ఆడ్రాగన్ కంట్రీ నోరు విప్పడంలేదు కానీ..సిట్చువేషన్ కొవిడ్-19కన్నా భీకరంగా ఉంది. పరిస్థితి లైట్‌తీసుకుంటే..ఐదేళ్ల కిందట పరిణామాలకు మించి ఉంటుందన్న ఆందోళన ప్రపంచదేశాల్లో మొదలైంది. రోజుకు 2వేలమంది నుంచి 3వేలమంది పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్నారట. అత్యవసరవిభాగాలన్నీ నిండిపోయాయట. చైనాలోని వైరస్ బాధితులే సోషల్ మీడియాలో వాపోతున్న పరిస్థితి.
శీతాకాలం అంటే అంటువ్యాధులు త్వరగా అంటుకునే కాలం. సాధారణంగా ఈకాలంలో జలుబు, జ్వరం, దగ్గు, పలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడం కామన్. కానీ ేసాధారణ జ్వరం అనుకుని అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. HMPVవైరస్ లక్షణాలు కూడా ఇంచుముంచు కరోనా లక్షణాలే. జలుబు, జ్వరం, దగ్గు , మూక్కుకారడం, పూడుకుపోవడం జరుగుతుంది.
HMPVవైరస్ సోకినవారిలో కూడాఇవే లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం చైనాలో పిల్లలు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. మైక్రోప్లాస్మా న్యుమోనియా, ఇన్‌ఫ్లుఎంజా A వంటి అనేక అంటువ్యాధులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై HMPV వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బీజింగ్, తింజిన్, హెబీ, షాంగ్జీలో ఎక్కువకేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నికేసులు నమోదయ్యాయో చైనా డేటా రిలీజ్ చేయలేదు. కానీ అంత డేంజర్ సిట్చువేషన్ లేదని మాత్రం చెబుతోంది. కొవిడ్ తొలినాళ్లలో కూడా ఇవేమాటలతో ప్రపంచాన్ని చైనా మభ్యపెట్టింది. దాని పర్యావసానం ఏమైందో చూశాం..అందుకే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఓరకంగా కొవిడ్ 19కంటే HMPV ప్రమాదకారి అనే వాదనకూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌లేదు. అలాగని ఇదేమీ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వైరస్ కాదు. 20ఏళ్ల కిందటే ఈవైర్‌సను కనుగొన్నారు. 2011-2012లో యూఎస్, కెనడా, యూరోప్‌లో HMPVకేసులు నమోదయ్యాయి.
“HMPV వైరస్ కొత్తది కాదు. పాతదే . 20ఏళ్ల కిందటే ఈవైరస్‌ను కనుగొన్నారు. ఇది ముఖ్యంగా శీతాకాలంలో వస్తుంది, ఇది ఇన్ఫ్లుఎంజా వైరస్, సాధారణ వైరల్ జ్వరం వంటిది. దీనిలక్షణాలు జలుబు, దగ్గు, జ్వరం. జనరల్ మెడిసిన్‌తో ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు” అని చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ సురేష్ గుప్తా చెప్పారు.
2019 చివరిలో వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు మరణించారు. చైనాలోని వూహాన్ నగరంలోని ఓ ల్యాబ్‌లో ఈ వైరస్ పుట్టిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ.. మరో వైరస్.. అది కూడా మళ్లీ చైనాలో వ్యాపించడంతో.. ప్రభుత్వాలే కాదు.. ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యులు మాత్రం HMPV ప్రాణాంతకం కాదని చెబుతున్నా…అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇటు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC దేశంలోని శ్వాసకోశ, సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా కేసులను నిశితంగా పరిశీలిస్తోంది. అలాగే అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది.
HMPVవైరస్ న్యూస్‌తో జనం అతలాకుతలమవుతుంటే..మరోవైపు నోరా వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు మరింత భయపెడుతున్నాయి. అమెరికాలో నోరా వైరస్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో 91 కొత్త కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం, నోరో వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది.
నోరా వైరస్ జీర్ణకోశానికి సోకే వ్యాధి. ఇది సోకితే వాంతులు, విరేచనాలు కలిగించి రోగులను డీహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది. వాంతులు , విరేచనాలతో మొదలై కడుపు, పేగుల్లో మంట కలిగిస్తుంది. ఈ పరిస్థితిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. చాలా మంది వ్యక్తులు 1-3 రోజుల్లో కోలుకుంటారు. కానీ వ్యాప్తి బాగా ఉంటుంది. నోరో వైరస్ సోకిన వారి నుంచీ ఇది నేరుగా సోకే అవకాశముంది.
లక్షణాలు వైరస్ సోకిన 12 -48 గంటల తర్వాత కనిపిస్తాయి. అతిసారం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి బాడీ నొప్పులు ఉంటాయి. మూత్రం సరిగారాకపోవడం, నోరు పొడిబారడం, కళ్లు తిరగడం, అసాధారణమైన నిద్రతో పాటు గందరగోళం లాంటి లక్షణాలుంటాయి. వైరస్ సోకిన రెండు రోజులపాటు తీవ్రత అధికంగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతుంది.
ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్స్ కరోనా వైరస్‌ను చంపినట్టు నోరో వైరస్‌ను చంపలేవు. నోరోవైరస్ అంటువ్యాధి కనుక ఈ వైరస్ వ్యాప్తికి పరిశుభ్రంగా ఉండటమే పెద్ద చికిత్స.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..