Vande Bharat Trains: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. వందే భారత్ ట్రైన్ రూట్లలో ‘ఫెన్సింగ్’ ఏర్పాటు..

|

Jan 29, 2023 | 8:26 PM

వందే భారత్ రైళ్ల విషయంలో రైల్వే శాఖ ముందడుగు వేసింది. జరుగుతున్న వరుస దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్న రూట్లలో ఎలాంటి..

Vande Bharat Trains: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. వందే భారత్ ట్రైన్ రూట్లలో ‘ఫెన్సింగ్’ ఏర్పాటు..
Follow us on

వందే భారత్ రైళ్ల విషయంలో రైల్వే శాఖ ముందడుగు వేసింది. జరుగుతున్న వరుస దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్న రూట్లలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుండా ఉండేందుకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ యాప్‌లో షేర్ చేశారు. వందే భారత్ ట్రైన్ రూట్‌లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగిందంటూ తెలిపారు. దీనిపై నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. మంచి నిర్ణయం తీసుకున్నారంటూ అభినందిస్తున్నారు నెటిజన్లు.

వందే భారత్‌పై కొందరు రాళ్లు రువ్వడం, ట్రాక్ పై నుంచి పశువులు దాటున్న సందర్భంలో ప్రమాదాలు చోటు చేసుకోవడం వంటి ఘటన ఇటీవలి కాలంలో చాలా వెలుగు చూశాయి. గుజరాత్‌లో తొలి వందేభారత్ రైల్ ని ప్రారంభించిన తొలి రోజుల్లోనే పశువులు ఢీకొనడం వల్ల రైల్ ముందు భాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఉండేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

వందే భారత్ రైల్ చాలా వేగంగా ప్రాయణిస్తుంది. దీని వేగాన్ని అంచనా వేయలేక, కొందరు పశువుల కారపర్లు ట్రాక్ పై నుంచి పశువులను దాటిస్తున్నారు. ఈ కారణంగానే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకని, ట్రాక్ ‌కి కొంద దూరంలో ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఈ ఫెన్సింగ్ కారణంగా.. ట్రాక్‌పైకి ఇక పశువులు రావడం అసాధ్యంగా మారింది.

ఇవి కూడా చదవండి

దేశ వ్యాప్తంగా ప్రస్తుతానికి 8 వందే భారత్ రైళ్లు ట్రాక్ మీదకు వచ్చాయి. ఆయా రూట్లలో ఇవి నడుస్తున్నాయి. అయితే, రైళ్లలో పరిశుభ్రత అంశం కూడా తీవ్ర చర్చనీయాంశం అవడంతో.. ఆ సమస్యను కూడా పరిష్కరించింది రైల్వే శాఖ. రైళ్లలో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రత్యేకంగా స్వీపర్లను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..