Nitish Kumar: ‘ఇండియా’ నుంచి వైదొలగడానికి కారణం వారే.. విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్..

Bihar Floor Test Updates: బీహార్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. అసెంబ్లీలో బలపరీక్షలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నెగ్గారు. విశ్వాసపరీక్షకు మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌ సందర్భంగా ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా విపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. విశ్వాసపరీక్షపై చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిహార్‌లో అసెంబ్లీలో 243 సభ్యులున్నారు.

Nitish Kumar: ‘ఇండియా’ నుంచి వైదొలగడానికి కారణం వారే.. విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్..
Bihar Assembly
Follow us

|

Updated on: Feb 12, 2024 | 4:11 PM

Bihar Floor Test Updates: బీహార్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. అసెంబ్లీలో బలపరీక్షలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నెగ్గారు. విశ్వాసపరీక్షకు మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌ సందర్భంగా ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా విపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. విశ్వాసపరీక్షపై చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిహార్‌లో అసెంబ్లీలో 243 సభ్యులున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్‌ ఫిగర్ 122. ఆర్జేడీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా.. ఇటీవల బీహార్ లో మహాకూటమిలో విభేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. అనంతరం, నితీష్ కుమార్ (కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు) మహాకూటమి నుంచి వైదొలిగిన తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరారు. ఆ తర్వాత సీఎంగా తొమ్మిదోసారి మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, బలపరీక్షకు ముందు బీహార్ అసెంబ్లీ సోమవారం ఆర్జేడీ నాయకుడు అవధ్ బిహారీ చౌదరిని హౌస్ స్పీకర్ పదవి నుంచి తొలగించే ప్రతిపాదనను ఆమోదించింది. దీని తరువాత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం అసెంబ్లీలో బిజెపి సహకారంతో ఏర్పాటు చేసిన తన కొత్త ప్రభుత్వానికి విశ్వాస ఓటు వేయడానికి ప్రతిపాదనను సమర్పించారు. ఆ తర్వాత ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారు.

చర్చ సందర్భంగా నితీష్‌ తీరుపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్‌ ఎన్నిసార్లు కూటమిని మారుస్తారంటూ ప్రశ్నించారు. విశ్వాసపరీక్షపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌పై , ఆర్జేడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌. ఇండియా కూటమి నుంచి తాను వైదొలగడానికి కాంగ్రెస్‌ నేతల తీరే కారణమన్నారు. విపక్షాలను ఏకం చేయడం కాంగ్రెస్‌ నేతలకు నచ్చలేదన్నారు. లాలూ కూడా కూటమిలో తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ నితీష్ కుమార్ అన్నారు.

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని బిజెపి-జెడియు సంకీర్ణ ప్రభుత్వం 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాస పరీక్షను నెగ్గినట్లు స్పీకర్ వెల్లడించారు. బలపరీక్షకు ముందు ప్రతిపక్షాలు వాకౌట్ చేయడంతో తీర్మానానికి వ్యతిరేకంగా సున్నా ఓట్లు వచ్చాయి. అనంతరం బీహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

కాగా.. విశ్వాస పరీక్షకు ముందు ఎమ్మెల్యేలు వేర్వేరు ప్రాంతాల్లో క్యాంప్‌ నిర్వహించారు. జేడీయూ ఎమ్మెల్యేలు పాట్నా అసెంబ్లీకి సమీపంలోని హోటల్ చాణక్యలో క్యాంప్ నిర్వహించగా.. ఆర్జేడీ ఎమ్మెల్యేలు తేజస్వి యాదవ్ నివాసంలో క్రికెట్, చెస్ ఆడుతూ కనిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని రిసార్ట్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!