August 14th: బ్రిటిష్ పాలకులు భారత దేశం నుంచి వెళ్తూ వెళ్తూ భారత ఉపఖండాన్ని విభజించి వెళ్లారు. అందుకే దేశ చరిత్రలో ఆగస్ట్ 14వ తేదీ కన్నీళ్లతో లిఖించబడిన రోజుగా భావిస్తారు. దేశం విడిపోయి 1947 ఆగస్టు 14న పాకిస్థాన్‌ను, 1947 ఆగస్టు 15న భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించిన రోజు ఇది. ఈ విభజన సమయంలో భారత ఉపఖండం రెండుగా విభజించబడడమే కాదు.. బెంగాల్ కూడా విభజించారు.. బెంగాల్ తూర్పు భాగం భారతదేశం నుండి వేరు చేయబడి తూర్పు పాకిస్తాన్‌గా ఏర్పాటు చేశారు. ఈ తూర్పు పాకిస్థాన్.. 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌గా ఏర్పడినది. దేశం ముక్కలై.. 75 ఏళ్ళు అయినా నేటికీ విభజన గాయాల నుంచి నెత్తురు శ్రవిస్తూనే ఉంది. వాస్తవానికి భారత దేశం మాత్రమే ముక్కలు కాలేదు.. అనేక మంది హృదయాలు, కుటుంబాలు, సంబంధాలు ముక్కలయ్యాయి. భారతమాత గుండెల్లో ఈ విభజన గాయంనుంచి శతాబ్దాలపాటు రక్తం స్రవిస్తూనే ఉంది. అంతేకాదు అనేక తరాలుగా అత్యంత బాధాకరమైన ఈరోజు నీడ బాధను అనుభవిస్తూనే ఉన్నారు.
దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఆగస్టు 14వ తేదీ ఎందుకు ప్రత్యేకం?
1862: బొంబాయి హైకోర్టు స్థాపన.
1908: మొదటి అందాల పోటీ ఇంగ్లాండ్‌లోని ఫోక్‌స్టోన్‌లో జరిగింది.
1917: జర్మనీ , ఆస్ట్రియాపై చైనా యుద్ధం ప్రకటించింది.
1924: ప్రముఖ రచయిత , పాత్రికేయుడు కుల్దీప్ నాయర్ జననం.
1938: మొదటి BBC ఫీచర్ ఫిల్మ్ (స్టూడెంట్ ఆఫ్ ప్రేగ్) టెలివిజన్‌లో ప్రసారం చేయబడింది.
1947: భారతదేశం విభజించబడింది . పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా మారింది.
1968: పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్-ఎ-పాకిస్తాన్ ను మొరార్జీ దేశాయ్ అందుకున్నారు
1971: 110 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ పాలన నుండి బహ్రెయిన్ స్వాతంత్య్రం పొందింది.
1975: పాకిస్తాన్ సైన్యం అధ్యక్షుడు ముజీబ్ ఉర్-రెహ్మాన్‌ను పదవీచ్యుతుణ్ణి చేసింది.
2003: తూర్పు అమెరికా, కెనడాలో సుదీర్ఘ విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో న్యూయార్క్, ఒట్టావా వంటి ప్రధాన నగరాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
2006: ఐక్యరాజ్యసమితి చొరవతో, ఇజ్రాయెల్, దక్షిణ లెబనాన్‌లో వివాదం ముగిసింది.
2006: ఇరాక్‌లోని కహత్నియాలో జరిగిన బాంబు దాడిలో 400 మంది మరణించారు.
2013: ఈజిప్టులో పోలీసులు , నిరసనకారుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 638 మంది మరణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..