Tamil Nadu: ‘మా వైపు నుంచి మీరు ఒక్కడుగు వేస్తే.. మీ వైపునుంచి మేం రెండడుగులు వేస్తాం’ సీఎం స్టాలిన్‌ లేఖపై మంత్రి అశ్విని వైష్ణవ్ రియాక్షన్‌

|

Aug 20, 2024 | 7:06 AM

తమిళనాడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధుల్లో కోత పెట్టిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం (ఆగస్టు 19) ఆరోపించారు. దక్షిణ రైల్వేకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కేంద్రం పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తమిళనాడు రాష్ట్ర రైల్వేల అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం సగటు..

Tamil Nadu: మా వైపు నుంచి మీరు ఒక్కడుగు వేస్తే.. మీ వైపునుంచి మేం రెండడుగులు వేస్తాం సీఎం స్టాలిన్‌ లేఖపై మంత్రి అశ్విని వైష్ణవ్ రియాక్షన్‌
Minister ashwini vaishnaw quashes MK stalin's claims
Follow us on

చెన్నై, ఆగస్టు 20: తమిళనాడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధుల్లో కోత పెట్టిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం (ఆగస్టు 19) ఆరోపించారు. దక్షిణ రైల్వేకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కేంద్రం పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తమిళనాడు రాష్ట్ర రైల్వేల అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం సగటు కేటాయింపు కంటే 7 రెట్లు అధికంగా కేటాయించిందన్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.6,362 కోట్లు కేటాయించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

‘బడ్జెట్‌లో తీవ్రస్థాయిలో కోతలు విధించడం తగదు.. నిధుల కేటాయింపుపై జోక్యం చేసుకోండి’

2024-2025 ఆర్థిక సంవత్సరానికి గానూ సాధారణ రైల్వే బడ్జెట్‌లో దక్షిణ రైల్వేకు నిధుల కేటాయింపు చాలా తక్కువగా ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సీఎం స్టాలిన్‌ లేఖ రాశారు. 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో కొత్త లైన్లకు రూ.976.1 కోట్లు, డబ్లింగ్ లైన్లకు రూ.2,214.4 కోట్ల కేటాయింపు ఉంటే.. జులై 23న కేంద్రం ప్రవేశ పెట్టిన రెగ్యులర్‌ బడ్జెట్‌లో మాత్రం కొత్త లైన్లకు రూ.301.3 కోట్లు, లైన్ల డబ్లింక్‌కు రూ.1,928.8 కోట్లు మాత్రమే కేటాయించారని సీఎం స్టాలిన్‌ లేఖలో తెలిపారు. ఇదే విషయమై సీఎం స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ సదరు లేఖను పోస్టు చేశారు. బడ్జెట్‌లో తీవ్రస్థాయిలో కోతలు విధిస్తే తమిళనాడులోని ముఖ్యమైన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని లేఖలో తెలిపారు. ఈ కీలకమైన పరిణామాల్లో జాప్యాన్ని నివారించడానికి తగినన్ని నిధులు ఉండేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాని లేఖలో సీఎం స్టాలిన్ కోరారు.

ఇవి కూడా చదవండి

‘7 రెట్లు అధికంగా నిధులు ఇచ్చాం..’

ఇక దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. సీఎం ఎంకే స్టాలిన్‌ను ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. తమిళనాడులో రైల్వేల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.6,362 కోట్లు కేటాయించిందన్నారు. ఈ మొత్తం యూపీఏ హయాంలో జరిగిన సగటు కేటాయింపుల కంటే 7 రెట్లు ఎక్కువని తెలిపారు. ఏడాదికి రూ.879 కోట్లు మాత్రమేనని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం అధికంగా రూ.6,362 కోట్లు కేటాయించిందని కేంద్రం చర్యను సమర్ధించారు. అనంతరం సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మన రాజ్యాంగ నిర్మాణంలో భూమి రాష్ట్రానికి సంబంధించిన అంశం అని అన్నారు. భూసేకరణలో మీ ప్రభుత్వం మాకు సహకరిస్తే, మీ ప్రాజెక్టులు వేగంగా అమలు చేయబడతాయన్నారు. 2,749 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 807 హెక్టార్ల భూమిని మాత్రమే సేకరించారు. భూసేకరణలో మీ (సీఎం స్టాలిన్) జోక్యాన్ని కోరుకుంటున్నామని రైల్వే మంత్రి కోరారు. మా వైపు నుంచి మీరు ఒక్క అడుగు వేస్తే తమిళనాడులో రైల్వే అభివృద్ధికి మేం రెండు అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.