కొందరు మనుషులు కొన్నిసార్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. కారణమేదైనా.. వారు చేసే పని అందరినీ వాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే వందేభారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వాష్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఆ తరువాత ఎంతకీ బయటకు రాలేదు. పైగా బయటకు రానంటే రాను అంటూ మొండికేశాడు. చివరకు చేసేది లేక వాష్‌రూమ్ తలుపులు పగలగొట్టి బలవంతంగా బయటకు తీసుకువచ్చారు అధికారులు. ఈ ఘటన ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలలోని ఉత్తర కాసరగోడ్ జిల్లాలో ఓ వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి టిక్కెట్ లేకుండానే వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. అయితే, తన వెంట ఉన్న వ్యక్తిని వదిలించుకునే ఉద్దేశ్యంతో అతను వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అలా వాష్‌రూమ్‌కు వెళ్లిన వ్యక్తి లోపలివైపు గడియపెట్టుకుని అందులోనే ఉండిపోయాడు. ఎంతకీ బయటకు రాలేదు. కన్నూర్, కోజికోడ్ స్టేషన్లు దాటినప్పటికీ బయటకు రాలేదు. చాలామంది వెళ్లి డోర్ తట్టినా అతను స్పందించలేదు. చివరకు రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది అందరూ వచ్చారు. బయటకు రావాలంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతను డోర్ ఓపెన్ చేయలేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది.. ఆ వాష్ రూమ్ డోర్ పగలగొట్టి, లోపల ఉన్న వ్యక్తిని బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో సదరు వ్యక్తి భయంతో వణికిపోతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఇలా ఎందుకు చేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే, ఇతనికి సంబంధించి వివరాలే తెలియరాలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. అతనిపై రైల్వే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదిలాఉంటే.. కాసరగోడ్ – తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలోని 15వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది కాసరగోడ్ నుంచి తిరువనంతపురం వరకు నడుస్తోంది. ఈ రైలు సర్వీసును 2023 ఏప్రిల్ 25న తిరువనంతపురం సెంట్రల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..