ఓ వ్యక్తి తన కారులో వేరే ఊరుకి వెళ్తున్నాడు. సరిగ్గా మార్గం మధ్యకు రాగానే అలసిపోయి కాసేపు తన కారును ఓ పక్కన ఆపాడు. ఈలోపు బోనెట్ నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించాడు. ఏంటని దాన్ని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు హడలిపోయాడు. ఇంతకీ అసలేం జరిగింది..? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని మల్లాపూర్ ప్రాంతంలో 10 అడుగుల కింగ్‌కోబ్రా స్థానికంగా భయభ్రాంతులకు గురి చేసింది. హల్చల్ చేసింది. ఓ వ్యక్తి తన కారులో జై సింగ్ కైగా ప్రాంతం నుంచి కార్వార్కు బయల్దేరాడు. ఇంతలో మార్గమధ్యలో మల్లాపుర్ సమీపంలో కాసేపు తన కారును ఆపాడు. ఆ సమయంలో అతడు బోనెట్ నుంచి వింత శబ్దాలు రావడాన్ని గుర్తించాడు. ఎప్పుడు దూరిందో గానీ.. 10 అడుగుల కింగ్ కోబ్రా అతడి కారు ముందుభాగంలో ప్రవేశించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అతడు.. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని దాదాపు 4 గంటల పాటు శ్రమించి పామును బయటకు తీశారు. అనంతరం దాన్ని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.