నారా లోకేశ్‌కు చేదు అనుభవం..గో బ్యాక్ అంటూ నినాదాలు

తూర్పు గోదావరి జిల్లాలో నారా లోకేశ్ ప్రజా చైతన్య యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోకేశ్ పర్యటనను అడ్డుకున్నారు రైతులు. కుర్చీలు విసిరేసి, టెంట్లు కూల్చేశారు. కాటవరంలో ఎన్టీఆర్ విగ్రహవిష్కరణకు వెళ్తున్న నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. టీడీపీ ప్రభుత్వం పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకంలో తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేసిందని రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేశ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అధికార వైసీపీ మద్దతుదారులు కూడా అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి మరింత […]

నారా లోకేశ్‌కు చేదు అనుభవం..గో బ్యాక్ అంటూ నినాదాలు
Follow us

|

Updated on: Mar 03, 2020 | 5:51 PM

తూర్పు గోదావరి జిల్లాలో నారా లోకేశ్ ప్రజా చైతన్య యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోకేశ్ పర్యటనను అడ్డుకున్నారు రైతులు. కుర్చీలు విసిరేసి, టెంట్లు కూల్చేశారు. కాటవరంలో ఎన్టీఆర్ విగ్రహవిష్కరణకు వెళ్తున్న నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. టీడీపీ ప్రభుత్వం పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకంలో తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేసిందని రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేశ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అధికార వైసీపీ మద్దతుదారులు కూడా అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.