నల్లగొండ జిల్లా ఎస్పీ ఫేస్‌బుక్ అకౌంట్‌ హాక్

సైబర్ కేటుగాళ్లు ప్రముఖులనే టార్గెట్ చేస్తున్నారు. వీఐపీల సోషల్ మీడియా అకౌంట్లను హాక్ చేస్తూ విలువైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. అంతేకాదు తప్పుడు మెస్సేజ్‌లతో డబ్బులు డిమాండ్ చేసిన సొమ్ము చేసుకుంటున్నారు.

నల్లగొండ జిల్లా ఎస్పీ ఫేస్‌బుక్ అకౌంట్‌ హాక్
Follow us

|

Updated on: Sep 18, 2020 | 7:02 PM

సైబర్ కేటుగాళ్లు ప్రముఖులనే టార్గెట్ చేస్తున్నారు. వీఐపీల సోషల్ మీడియా అకౌంట్లను హాక్ చేస్తూ విలువైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. అంతేకాదు తప్పుడు మెస్సేజ్‌లతో డబ్బులు డిమాండ్ చేసిన సొమ్ము చేసుకుంటున్నారు.. తాజాగా నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సైబర్ నేరస్తులు హాక్‌ చేశారు. ఎస్పీ పేరుతో పలువురికి మెస్సేజ్‌లు పంపుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాడు డబ్బులను ఆయన భార్య అకౌంట్‌కు పంపాలంటూ పలువురికి మెస్సేజ్‌లు పంపారు. ఇదే క్రమంలో వసూలు చేసిన సొమ్మును ఒడిశాకు చెందిన అనిత పేరుతో గూగుల్‌పే, ఫోన్‌పే నెంబర్లను పంపించారు. డబ్బులు అకౌంట్లో వేసి స్క్రీన్‌షాట్‌ పంపాలంటూ పలువురితో చాటింగ్‌ చేశారు. ఈ విషయమై అనుమానం వచ్చిన ఎస్పీ రంగానాథ్ సైబర్ పోలీసులను అశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎస్పీ రంగనాథ్‌ స్పందించారు. ఎవరూ తన అకౌంట్‌కు డబ్బులు పంపొద్దని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలుగా తన ఫేస్‌బుక్ అకౌంట్‌ వాడడం లేదని, ఎవరిని డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అది తన అకౌంట్‌ కాదని ఎస్పీ రంగనాథ్‌ వివరణ ఇచ్చారు.