యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు…: మంత్రి కేటీఆర్

Minister KTR Has Directed : వరద విపత్తుతో నగరంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పది రోజుల పాటు పారిశుధ్య డ్రైవ్‌ చేపట్టాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, డైరెక్టర్‌ సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ, జల మండలి, విద్యుత్‌ శాఖ, మెట్రో రైల్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 4లక్షల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని, ఒక్కో […]

యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు...: మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Oct 29, 2020 | 11:02 PM

Minister KTR Has Directed : వరద విపత్తుతో నగరంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పది రోజుల పాటు పారిశుధ్య డ్రైవ్‌ చేపట్టాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, డైరెక్టర్‌ సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ, జల మండలి, విద్యుత్‌ శాఖ, మెట్రో రైల్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

వరదల కారణంగా 4లక్షల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని, ఒక్కో ఫ్యామిలీకి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం రూ. 400 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఇప్పటివరకూ 3లక్షల మందికి పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. మరో 37వేల రేషన్‌ కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. నగరంలో 1,577 ప్రాంతాలు తీవ్ర ప్రభావితం కాగా, 230 కాలనీలు, బస్తీలు పూర్తిగా నీట మునిగాయన్నారు. బాధితులెవరికైనా పరిహారం అందకపోతే జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించాలని సూచించారు.