బానిసలుగా బతకాలనుకుంటున్నారా? ముద్రగడ బహిరంగలేఖ

Mudragada wrote a open letter to AP CM Jagan for Kapu reservations issue, బానిసలుగా బతకాలనుకుంటున్నారా? ముద్రగడ బహిరంగలేఖ

ఏపీ ప్రభుత్వాన్ని కాపు రిజర్వేషన్ల అంశం ఇరుకునపెడుతోంది. జగన్ సర్కార్‌కు పంటికింద రాయిలా మారిన ఈ అంశంతో సీఎం జగన్ తాజాగా ఓ కమిటీని ఏర్పాటుచేసి మంజునాథ కమిటీ సిఫార్సులను పరిశీలించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు.
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కుదరదన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసులు ఉన్నందున రిజర్వేషన్లు ఇవ్వలేమని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఎక్కడ స్టే ఇచ్చారో, అసెంబ్లీలో గానీ, మీడియాతో గానీ చెబితే తాను సంతోషించేవాడినంటూ ఆ లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. మా జాతి బానిసలుగా బతకాలని మీరు భావిస్తున్నారా? మీరు ఇస్తానన్న రూ.2 వేల కోట్లతో కాపు కులస్తులు బతకాలని మీరు అనుకుంటున్నారా? అటూ ముద్రగడ ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని, కానీ ఇప్పుడు కేంద్రం ఇదే అంశాన్ని ముగిసిన అధ్యాయంగా చెబుతోందన్నారు ముద్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *