టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు గాను ఇంచార్జిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం శుక్రవారం నిర్ణయించింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టులో మంత్రి కేటీఆర్ గురువారం తన పేరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]

టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
Follow us

|

Updated on: Oct 09, 2020 | 4:59 PM

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు గాను ఇంచార్జిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం శుక్రవారం నిర్ణయించింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టులో మంత్రి కేటీఆర్ గురువారం తన పేరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం మరింతగా ఉందని అన్నారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు అంతా తమ పేరుని కచ్చితంగా ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో మొత్తం ఓటర్ లిస్ట్ తాజా ఓటర్ల నమోదు ఆధారంగానే ఉంటుందని గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.