Breaking News
  • నల్గొండ: రూ.3 లక్షల విలువైన సానిటైజర్లు, మాస్కులు జిల్లా ఎస్పీ రంగనాథ్‌కు అందించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌, పాల్గొన్న జెడ్పీచైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి, విద్యాసాగర్‌ను అభినందించిన ఎస్పీ.
  • సిద్దిపేట: మంత్రి హరీష్‌రావు పర్యటన. కరోనా కట్టడికి తీసుకుంటున్న పనుల పరిశీలన. కారణంలేకుండా రోడ్లపైకి వచ్చినవారిపై హరీష్‌ ఆగ్రహం. వాహనాలను సీజ్‌ చేయించిన మంత్రి హరీష్‌రావు.
  • ప.గో: కరోనా క్రైసిస్‌ చారిటీకి రూ.75 వేలు విరాళంగా ఇచ్చిన నటుడు బ్రహ్మాజీ.
  • ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి పెరుగుతున్న కేసులు. మద్యం దొరకక వింతగా ప్రవర్తిస్తున్న మందుబాబులు. ఎర్రగడ్డ ఆస్పత్రికి రోగుల తాకిడి. ఓపీకి 100కు పైగా వచ్చిన బాధితులు.
  • నాగర్‌ కర్నూలు జిల్లాలో కరోనా కలకలం. నాగర్‌కర్నూల్‌లో నలుగురు, కల్వకుర్తిలో నలుగురు.. అచ్చంపేటలో ముగ్గురికి కరోనా లక్షణాలు. ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించిన అధికారులు. ఢిల్లీలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి వచ్చిన అనుమానితులు. హైదరాబాద్‌లో మృతిచెందిన కరోనా బాధితుడు ప్రయాణించిన.. రైలు బోగీలో అనుమానితులు ప్రయాణించినట్టు గుర్తించిన అధికారులు.

కెనడా చేరిన మాజీ రాచ దంపతులు.. ఇక రాయల్ హోదాకు స్వస్తి !

Her Royal Happiness: Meghan Markle beams, కెనడా చేరిన మాజీ రాచ దంపతులు.. ఇక రాయల్ హోదాకు స్వస్తి !

బ్రిటన్ రాచరిక హోదా వదులుకున్న ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ కెనడాలోని వాంకోవర్ చేరుకున్నారు. మొదట మార్కెల్ తన ఎనిమిది నెలల  కుమారుడు ఆర్చీతోను, తను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న రెండు శునకాలతోను ఈ సిటీలో అడుగు పెట్టారు. ఆమె ఇక్కడికి చేరుకున్న కొన్ని గంటల్లోనే హ్యారీ కూడా బ్రిటన్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాంకోవర్ లోని హార్త్ హిల్ రీజనల్ పార్కులో ఇద్దరు బాడీగార్డులు వెంట వస్తుండగా.. మార్కెల్ చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగారు.

Her Royal Happiness: Meghan Markle beams, కెనడా చేరిన మాజీ రాచ దంపతులు.. ఇక రాయల్ హోదాకు స్వస్తి !

కెనడా చేరకముందు హ్యారీ.. లండన్ లో జరిగిన బ్రిటన్-ఆఫ్రికా ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు హాజరయ్యారు. తమ ‘ రాచరిక హోదా ‘ వదులుకున్న ఈ దంపతులు ఇక కెనడాలోనే స్థిరపడే అవకాశం కనిపిస్తోంది. తమ ఆధ్వర్యంలోని ప్రొడక్షన్ హౌస్ ద్వారా వీరు క్లైమేట్ వంటి సామాజిక సమస్యలపై డాక్యుమెంటరీలు నిర్మించనున్నారు. మెర్కెల్ ఇప్పటికే కొన్ని డాక్యుమెంటరీలకు వాయిస్-ఓవర్ ఇచ్చారట.  రాయల్ హోదా వదులుకున్న కారణంగా ఈ జంటకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి నిధులు అందవు. అయితే తాము ఇక సాధారణ పౌరుల్లాగా జీవిస్తామని హ్యారీ, మెర్కెల్ ఇదివరకే ప్రకటించారు.

 

 

 

Related Tags