Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్…కరిగిపోతున్న మంచుకొండలు

, పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్…కరిగిపోతున్న మంచుకొండలు

గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు భవిష్యత్‌లో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మనిషి చేస్తున్న తప్పిదాల మూలంగా వాతావరణం వేడెక్కిపోవుతుండటంతో..ఉత్తర, దక్షిణ ధృవాలలోని విస్తారమైన మంచుకొండలు కరుగుతూ వస్తున్నాయి. మంచు ఖండంగా పిలుచుకునే అంటార్కిటికాలో కిలోమీటర్ల విస్తీర్ణం మీర మంచుపలకలు విరిగిపడుతూ సముద్ర జలాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా 250 స్కేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓ భారీ మంచుపలక విరిగిపడటంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలు ఆందోళనకు గురవుతున్నారు.

నెదర్లాండ్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాలజీకి చెందిన శాటిలైట్ అబ్జరవేషన్ స్ఫెషలిస్ట్ స్టెప్ లెర్మిటి అనే శాటిలైట్ తీసిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోటోలు అంటార్కిటికాలోని 250 స్కేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఫైనాలాండ్ విరిగి ముక్కలు, ముక్కలుగా విడిపోయి సముద్ర జలాల్లో కలుస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత భారీ పరిమాణంలోొని మంచు పలకలు విరిగిపడటం  గత రెండు సంవత్సరాలలో ఇది రెండవసారి. ఇలా మంచు పలకలు విరిగి సముద్ర జలాల్లో కలుస్తుండటంతో నీటిమట్టం పెరుగుతూ వస్తుంది. గ్లెసియర్ మూలంగా ప్రతి సంవత్సరం 45 బిలియన్ టన్నుల మంచు కరిగి సముద్రంలో కలుస్తున్నాయి. దీంతో  ప్రతి 8 సంవత్సరాలకు ఒక మిల్లి మీటర్ చొప్పున సముద్రాల నీటి మట్టం పెరుగుతూ వస్తుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మరికొద్ది సంవత్సరాలలోనే  సముద్ర అంచున ఉన్న నగరాలు తుడిచిపెట్టుకు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.