Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ఎన్నార్సీతో ప్రాణాలు పోతున్నాయి… బీజేపీకి దీదీ స్ట్రాంగ్ కౌంటర్

Mamata Banerjee Accuses BJP of Creating Panic Over NRC in Bengal, Says It Has Led to 6 Deaths

దేశమంతటా ఎన్నార్సీని అమలు చేసేందుకు రెడీ అవుతున్న కేంద్ర ప్రభుత్వంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసోం ఒప్పందం కారణంగానే అక్కడ ఎన్నార్సీ అమలు జరిపారని, పశ్చిమ బెంగాల్‌లో అలజడులు సృష్టించేందుకు బీజేపీ రెడీ అవుతోందని ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన కార్మిక సంఘాల సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్నార్సీ ప్రక్రియను అనుమతించేది లేదని దీదీ తేల్చి చెప్పారు. కేవలం బెంగాల్‌లో మాత్రమే కాదు, మిగిలిన ఏ రాష్ట్రాల్లోనూ అమలు కాకుండా చేస్తామన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దీన్ని అమలు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీకి ఆ పార్టీ అధికారంలో ఉన్న త్రిపురలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ పేరు కూడా ఈ జాబితాలో ఉండదన్న విషయం తెలియడం వల్లే బీజేపీ అక్కడ ఎన్‌ఆర్‌సీ ఊసు ఎత్తడం లేదని ఆమె తెలిపారు.

బెంగాల్‌లో ఎన్నార్సీ అమలు చేస్తారన్న భయంతో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని, తమ రాష్ట్రంలో బీజేపీ భయోత్పాతాన్ని సృష్టించాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. దేశంలో ఒకపక్క నిరుద్యోగం పెరిగిపోతున్నా.. ఆర్థిక మాంద్యం తీవ్రమవుతున్నా బీజేపీకి ఏమాత్రం పట్టడం లేదని, తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే ధ్యేయంగా ఆ పార్టీ పనిచేస్తోందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, మూసివేతలకు నిరసనగా వచ్చే నెల 18న ర్యాలీ నిర్వహిస్తామని, అందులో తానే స్వయంగా పాల్గొంటానని మమతా వెల్లడించారు. ఈనెల 26, 27 తేదీల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోల్‌కతా నగరంలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ఆమె అన్నారు.