“మై పల్ దో ప‌ల్” సాంగ్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ

అపర క్రీడా చాణక్యుడు.. అంతర్జాతీయ ఆటకు శనివారం వీడ్కోలు పలికాడు. మిస్టర్ కూల్‌ పేరుతో కోట్లాదిమంది ఫ్యాన్స్‌ను ఏర్పర్చుకున్న ధోనీ తన అంతర్జాతీయ ఆటకు ముగింపు పలికాడు.

మై పల్ దో ప‌ల్ సాంగ్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ
Follow us

|

Updated on: Aug 16, 2020 | 5:50 AM

Main Pal Do Pal Song Add Dhoni’s Retirement Post : అపర క్రీడా చాణక్యుడు.. అంతర్జాతీయ ఆటకు శనివారం వీడ్కోలు పలికాడు. మిస్టర్ కూల్‌ పేరుతో కోట్లాదిమంది ఫ్యాన్స్‌ను ఏర్పర్చుకున్న ధోనీ తన అంతర్జాతీయ ఆటకు ముగింపు పలికాడు. దేశంపై తన భక్తిని ఎన్నో సందర్భాల్లో చూపించిన ధోనీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీ.. తన రిటైర్మెంట్‌ను కూడా చాలా పద్దతి ప్రకారం ఎంతో కూల్‌గా ప్రకటించాడు.

ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ 4.07 నిమిషాల వీడియోను పోస్ట్ చేశాడు. అందులో తనకు ఎంతో ఇష్టమైన ఫోటోలను జత చేశాడు. ఈ ఫోటోలకు ఓ పాటను కూడా జోడించాడు. “మై పల్ దో ప‌ల్ కా షాయ‌ర్ హూ.. ప‌ల్ దో ప‌ల్ మేరీ క‌హానీ హై.. ప‌ల్ దో ప‌ల్ మేరీ హ‌స్తీ హై.. ప‌ల్ దో ప‌ల్ మేరీ జ‌వానీ హై.. ” అంటూ సాగి పోయే ఓ హింది పాటను యాడ్ చేశాడు.

View this post on Instagram

Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired

A post shared by M S Dhoni (@mahi7781) on

1976లో అమితాబ్ న‌టించిన ‘క‌బీ క‌బీ’ సినిమాలోని క్లాస్ సాంగ్‌.. ఆ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ముఖేశ్ ఈ పాట‌ను పాడారు. ఖ‌య్య‌మ్ దీనికి సంగీతం అందించారు. సాహిర్ లుదియాన్వి ఈ పాట‌ను రాశారు. య‌శ్ చోప్రా ఆ సినిమాకు డైర‌క్ట‌ర్‌గా చేశారు. అయితే ఈ సినిమాలో ఉన్న అన్ని పాట‌లు హైలెట్‌. ఖ‌య్య‌మ్ స్వ‌ర‌ప‌రిచిన‌ బాణీలు అప్పట్లో సినీ ప్రేక్ష‌కుల్ని ఎంతో థ్రిల్ చేశాయి. ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అవార్డు కూడా ద‌క్కింది. అయితే ధోనీ త‌న రిటైర్మెంట్ వీడియోకు ఈ పాట‌ను ఎంపిక చేసుకున్న తీరు అత‌ని మ‌న‌సును తెలుపుతున్న‌ది. త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసిన రిటైర్మెంట్ కామెంట్స్‌తో పాటు ఈ వీడియోను అటాచ్ చేశాడు.