మహారాష్ట్రకు మరిన్ని పద్మా అవార్డులు ఇవ్వాల్సింది, కేంద్ర వైఖరిపై శివసేన నేత సంజయ్ రౌత్

పద్మా అవార్డుల ప్రదానంలో మహారాష్ట్రకు అన్యాయం జరిగిందని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మహారాష్ట్రకు మరిన్ని పద్మా అవార్డులు ఇవ్వాల్సింది,  కేంద్ర వైఖరిపై శివసేన నేత సంజయ్ రౌత్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 26, 2021 | 6:10 PM

పద్మా అవార్డుల ప్రదానంలో మహారాష్ట్రకు అన్యాయం జరిగిందని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం నుంచి కనీసం 10 నుంచి 12 మందికి పద్మా అవార్డులు దక్కాల్సి ఉందని ఆయన అన్నారు. కేవలం ఆరుగురికి మాత్రమే ఈ పురస్కారాలను ఇఛ్చారని ఆయన పేర్కొన్నారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ కేటగిరీలో వీటిని ప్రదానం చేయాల్సి  ఉండిందని సంజయ్ అన్నారు.. కళలు, విద్య, సైన్స్, సామాజిక సేవ వంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారు ఈ రాష్ట్రంలో ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిన్న 119 పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో 7 పద్మ విభూషణ్, 10 పద్మ భూషణ్, 102 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.

మహారాష్ట్ర నుంచి రజనీ కాంత్ ష్రాఫ్, సింధు తాయ్ సప్తాల్, గిరీష్ ప్రభాసీ, నామ్ దేవ్ కాంబ్లీ, పరశురామ్ గంగావాన్, జస్వంతి బెన్ పోపట్ లకు ఈ ఏడాది పద్మ అవార్డులు దక్కాయి. అయితే తమ రాష్ట్రం చాలా పెద్దదని, 10 నుంచి 12 మందికి ఈ పురస్కారాలు ఇవ్వాల్సిందని సంజయ్  రౌత్ అన్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకి పద్మ అవార్డు ఇవ్వడంపై స్పందించిన ఆయన.. ఇండియాకు బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టును ఇఛ్చినందుకు బహుశా ఈ అవార్డు ఇఛ్చి ఉంటారు అని వ్యాఖ్యానించారు. కానీ ఆ ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందన్నారు.

Read More :మీ వ్యవహారం హుందాగా లేదు, శివసేన నేత సంజయ్ రౌత్ కు బాంబేహైకోర్టు చురకలు, అటు కంగనాపైనా .. Read More :8 నెలల తర్వాత రిటర్న్ టు కామెంట్రీ బాక్స్…ఇంట్లో వాళ్లంతా మస్త్ ఖుష్ ..ఈ సారి నో కాంట్రవర్సీ.