Maharashtra Lockdown Extends: పెరుగుతున్న కరోనా కేసులు.. జనవరి 31 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు పొడిగింపు

Maharashtra Lockdown Extends:దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు ....

Maharashtra Lockdown Extends: పెరుగుతున్న కరోనా కేసులు.. జనవరి 31 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు పొడిగింపు
Follow us

|

Updated on: Dec 30, 2020 | 3:41 PM

Maharashtra Lockdown Extends:దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతుండటంతో మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు 2021 జనవరి 31 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉంటాయని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. దీంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను జనవరి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు అని ప్రభుత్వం ఒక ప్రటకనలో తెలిపింది.

రాష్ట్రంలో కొత్త కరోనా వైరస్‌ లేదు

కాగా, తాజాగా యూకేలో మొదలైన కొత్త స్ట్రైయిన్‌ వైరస్‌ దేశంలోకి వ్యాపించింది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్త వైరస్‌ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని రాష్ర్ట వైద్యాధికారులు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి యూకే నుంచి వచ్చిన వారిలో 30 మందికి కరోనా పాజిటివ్‌ తేలిందని, కానీ వారిలో ఎవరికి కూడా కొత్త కరోనా వైరస్‌ సోకలేదని తెలిపారు.

వాటికి లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపు

ఇక ఇప్పటికే అనుమతించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనేక లాక్‌డౌన్‌ పరిమితులను సడలించింది. నవంబర్‌లో ప్రార్థనా మందిరాలను తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే 9 నుంచి 12వ తరగతి వరకు విద్యాసంస్థలు కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి తెరుచుకున్నాయి.

తాజాగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

దేశంలో అత్యధిక కేసులు నమోదువుతన్నరాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ప్రస్తుతం రాష్ట్రంలో 19,25,066 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మంగళవారం ఒక్క రోజే 3,018 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అక్కడ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా 69 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మహారాష్ట్రలో మరణాల సంఖ్య 49 వేలు దాటేసింది. ప్రస్తుతం 54వేలకుపైగా కేసులు యాక్టివ్‌ కేసులున్నాయి.

Also Read: కొత్త వైరస్ తొలి కేసు కోల్ కతాలో నమోదు, నాలుగు నగరాల్లో గుర్తింపు, యూపీలో రెండేళ్ల చిన్నారికి కూడా ! అలెర్ట్ తప్పదు !

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..