మహారాష్ట్రలో 43 వేలు దాటిన కరోనా మరణాలు

మహారాష్ట్రలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 43 వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 7,347 కరోనా కేసులు, 184 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,32,544కు, మరణాల సంఖ్య 43,015కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 13,247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 14,45,103కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ […]

  • Venkata Narayana
  • Publish Date - 10:20 pm, Fri, 23 October 20

మహారాష్ట్రలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 43 వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 7,347 కరోనా కేసులు, 184 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,32,544కు, మరణాల సంఖ్య 43,015కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 13,247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 14,45,103కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,43,922 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.