పెళ్లికి బంధువులను ఎక్కువ మందిని పిలిచిన పెళ్లికొడుకుపై కేసు

కరోనా నిబంధనలు ఓ పెళ్లి కొడుకుని కష్టాలపాలు చేశాయి. బంధుమిత్రుల సమక్షంలో ధూం ధాంగా పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అంతలోనే పోలీసులు అడ్డు చెప్పారు. ఏకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలో ఓ వరుడికి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ సర్కార్ బేఖాతర్ చేశాడు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో వివాహనికి ఎక్కువ మంది పిలవకూడదన్న నిబందనలు విధించింది ప్రభుత్వం. 24 ఏళ్ల వరుడు కను చౌహాన్‌ బేతుల్‌ జిల్లాలో పట్వారీ గ్రామ రెవెన్యూ అధికారి గా […]

పెళ్లికి బంధువులను ఎక్కువ మందిని పిలిచిన పెళ్లికొడుకుపై కేసు
Follow us

|

Updated on: May 26, 2020 | 6:10 PM

కరోనా నిబంధనలు ఓ పెళ్లి కొడుకుని కష్టాలపాలు చేశాయి. బంధుమిత్రుల సమక్షంలో ధూం ధాంగా పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అంతలోనే పోలీసులు అడ్డు చెప్పారు. ఏకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలో ఓ వరుడికి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ సర్కార్ బేఖాతర్ చేశాడు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో వివాహనికి ఎక్కువ మంది పిలవకూడదన్న నిబందనలు విధించింది ప్రభుత్వం. 24 ఏళ్ల వరుడు కను చౌహాన్‌ బేతుల్‌ జిల్లాలో పట్వారీ గ్రామ రెవెన్యూ అధికారి గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్లి కుదరడంతో బందుమిత్రుల సమక్షంలో అలీరాజ్‌పూర్‌లో పెళ్లికి గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకున్నాడు కను చౌహాన్. తన పెళ్లికి రావాలంటూ వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో ఆహ్వాన పత్రికను షేర్‌ చేశాడు. దీంతో దాదాపు 1000 మందికి పైగా జనాలు బంధుమిత్రులు పెళ్లికి హాజరయ్యారు. ప్రభుత్వ సూచించిన నిబంధలు ఏమాత్రం పాటించకుండా, కనీసం మాస్కులు కూడా ధరించలేదు. పెళ్లికి వచ్చిన వ్యక్తి ఒకరు ఆ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. దీంతో వెంటనే పోలీసులు సదరు పెళ్లి కొడుకు కనుపై సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు. అప్పటి వరకు సంబురంగా జరుగుతున్న పెళ్లి కాస్త.. కళ తప్పింది.