నిజామాబాద్ జిల్లాలో విషాదం.. బలవన్మరణానికి పాల్పడ్డ మరో ప్రేమజంట..!

నిజామాబాద్‌ జిల్లాలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. గాఢంగా ప్రేమించుకున్న జంట వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్దారు.

  • Balaraju Goud
  • Publish Date - 2:58 pm, Sat, 28 November 20

నిజామాబాద్‌ జిల్లాలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. గాఢంగా ప్రేమించుకున్న జంట వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్దారు. ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌లో ఈ విషాద సంఘటన జరిగింది. వేల్పూర్‌ మండలం కుకునూర్‌కు చెందిన రోహిత్‌, అవంతిక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కలకాలం తోడు నీడగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ, అందరిలాగా వారి వివాహనికి ఇరువురి పెద్దలు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ జంట.. కలిసి జీవించడం కంటే, కలిసి మరణాలనుకున్నారు. దీంతో ఇద్దరు పెర్కిట్‌ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.