తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘాట్ రోడ్డులో లారీ పల్టీ… లారీ డ్రైవర్ సజీవదహనం, తీవ్రంగా గాయపడ్డ క్లీనర్

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ దగ్ధమై డ్రైవర్ సజీవదహనం కాగా, క్లీనర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు.

  • Balaraju Goud
  • Publish Date - 8:18 pm, Sat, 21 November 20

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ దగ్ధమై డ్రైవర్ సజీవదహనం కాగా, క్లీనర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. ఏజెన్సీలో చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ లారీ పల్టీ కొట్టింది. దుర్గమ్మ గుడి సమీపంలో రక్షణ గోడ పైనుండి లోయలోకి పడిపోయింది. అంతే.. ఒక్కసారి మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. బయటపడేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. లారీ పల్టీ కొట్టడం.. వెంటనే మంటలు అంటుకోవడం.. చూస్తుండగానే చుట్టుముట్టేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. లారీడ్రైవర్‌కు బయటపడే అవకాశం ఏమాత్రం లేకుండాపోయింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ క్లీనర్ ను చింతూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికే లారీ డ్రైవర్ సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.