శ్రీవారి బ్రహ్మోత్సవాలు… నేడే గరుడసేవ!

తిరుమలలో శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ తొమ్మిది రోజులూ స్వామివారికి ఉదయం, సాయంత్రం జరిగే వాహన సేవలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి తిరు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవారికి జరిగే వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ సేవ. వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైనా అంగప్రత్యాంగాలు కలవాడు. శ్రీమహావిష్ణువు గరుడ సమ్మేళనం, వేదస్వరూప శీర్షాలుగా తెలుస్తుంది. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, […]

శ్రీవారి బ్రహ్మోత్సవాలు... నేడే గరుడసేవ!
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 3:41 AM

తిరుమలలో శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ తొమ్మిది రోజులూ స్వామివారికి ఉదయం, సాయంత్రం జరిగే వాహన సేవలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి తిరు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవారికి జరిగే వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ సేవ. వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైనా అంగప్రత్యాంగాలు కలవాడు. శ్రీమహావిష్ణువు గరుడ సమ్మేళనం, వేదస్వరూప శీర్షాలుగా తెలుస్తుంది. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, అసనంగా, అవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు. అంతేకాదు, శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మొత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే.

గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి ద్రువభేరమైన స్వామికి భేదంలేదని చెప్పడానికే, నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను గరుడ సేవలో అలంకరిస్తారు. గరుడోత్సవంలో స్వామి ఒక్కరే పాల్గొంటారు. ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగే శ్రీనివాసుని దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాడా విశ్వాసం. స్త్రీ పురుషలలో ఎవరు ఎక్కువన్న లింగ భేధాలను తన భక్తులు విడనాడాలన్నదే ఇందులోని అంతరార్థం.

గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని ప్రశస్తి. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గం ప్రాప్తించి, ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి, బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ విశిష్టత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు భారీగా భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 4న) శ్రీవారికి గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు. గరుడ సేవకు టీటీడీ సైతం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలకు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు