Yoga Vs Gym: యోగా లేదా జిమ్ వ్యాయామమా? ఈ రెండింటిలో ఏది మంచిది? నిపుణుల సలహా ఏమిటంటే

ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేసుకోవాలనుకునే వారు యోగా, ప్రాణాయామం చేస్తుంటారు. యోగాతో మీరు ఏకాగ్రత నేర్చుకుంటారు. యోగా .. జిమ్ వర్కౌట్‌లలో ఏది బెటర్ అనే ప్రశ్న కొంతమందికి ఎప్పుడూ మనసులో ఉంటుంది. ఈ విషయంపై కల్ట్ ట్రాన్స్‌ఫార్మ్ యోగా ఎక్స్‌పర్ట్ దివ్య రోల్లా అనేక విషయాలను చెప్పారు.

Yoga Vs Gym: యోగా లేదా జిమ్ వ్యాయామమా? ఈ రెండింటిలో ఏది మంచిది? నిపుణుల సలహా ఏమిటంటే
Yoga Vs Gym
Follow us

|

Updated on: Sep 07, 2024 | 8:21 PM

శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే యోగా లేదా వ్యాయామం చేయాల్సిందే.. ప్రస్తుతం ఎక్కువ మంది ఊబకాయం సమస్యతో సతమతమవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో జిమ్‌లో చెమటలు కక్కుతున్నారు. కొంతమంది వ్యాయామ శిక్షణపై దృష్టి పెడతారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం వ్యాయామం అనే శారీరక ప్రక్రియను చేస్తారు. ఇలా చేయడం వలన శారీరకంగానే కాదు మనసికమగా కూడా అనేక ప్రయోజనాలను పొందుతారు.

మరోవైపు ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేసుకోవాలనుకునే వారు యోగా, ప్రాణాయామం చేస్తుంటారు. యోగాతో మీరు ఏకాగ్రత నేర్చుకుంటారు. యోగా .. జిమ్ వర్కౌట్‌లలో ఏది బెటర్ అనే ప్రశ్న కొంతమందికి ఎప్పుడూ మనసులో ఉంటుంది. ఈ విషయంపై కల్ట్ ట్రాన్స్‌ఫార్మ్ యోగా ఎక్స్‌పర్ట్ దివ్య రోల్లా అనేక విషయాలను చెప్పారు.

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు. దీంతో ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాదు మన శరీరంలోని కండరాలు కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. యోగా, జిమ్ వ్యాయామాల మధ్య వ్యత్యాసం ఉంది. ఈ రెండింటి మధ్య తేడా గురించి ముందుగా చెప్పుకుందాం.

ఇవి కూడా చదవండి

యోగా అంటే ఏమిటి?

యోగా అనేది భౌతిక భంగిమలు, ధ్యానం, లోతైన శ్వాసలతో కూడిన ఒక పురాతన అభ్యాసం. యోగా అనేది శరీరం, మనస్సు, ఆత్మ ఐక్యంగా ఉండే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ పదం హిందూమతం, జైనమతం, బౌద్ధమతంలో ధ్యాన ప్రక్రియకు సంబంధించినది. యోగా అనేది సంస్కృత పదం యుజ్ నుండి వచ్చింది. అంటే సేకరించడం లేదా బంధించడం. యోగా ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. యోగాలో సూర్య నమస్కారంతో సహా అనేక ఆసనాలు, ప్రాణాయామం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు గణనీయంగా యోగా పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు.

జిమ్ వ్యాయామం

జిమ్ గురించి అందరికీ తెలుసు. వ్యాయామశాలలో వివిధ యంత్రాలతో పాటు గాడ్జెట్లను ఉపయోగించి వ్యాయామం చేస్తారు. ఫిట్ , టోన్డ్ బాడీని పొందడానికి చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. ప్రజలు జిమ్‌కి వెళ్లి కార్డియో, కాళ్లు , వెయిట్ లిఫ్టింగ్ వంటి వివిధ వ్యాయామాలు చేస్తారు.

రెండింటిలో ఏది మంచిది?

రెండు ఆరోగ్యానికి మేలు చేసేవే అని యోగా ఎక్స్‌పర్ట్ దివ్య రోలా చెబుతున్నారు. యోగాలో శ్వాస నియంత్రణ అంటే ప్రాణయ, ఆసనం .. యోగా నిద్ర వంటి అంశాలు ఉంటాయి. ఇది శరీరం, మనస్సు రెండింటినీ రిలాక్స్ చేస్తుంది. అదే సమయంలో జిమ్ వ్యాయామంలో శక్తి శిక్షణ ఉంటుంది. ఇది జీవక్రియ. కండరాలకు మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ శరీర తత్వాన్ని తెలుసుకోండి. మరింత సౌకర్యవంతంగా ఉన్న వాటిని ఆచరించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!