బల్లి నుంచి నూనె.. ఎక్కడంటే. ?
07 September 2024
Battula Prudvi
పాకిస్తాన్‌లో ఎడారి ప్రాంతాల్లో ఇసుకలో తచ్చాడే ఈ బల్లిని శాండా అంటారు. ఇది అచ్చంగా ఉడుములాగే ఉంటుంది.
శాండా బల్లులు ఒకప్పుడు భారతదేశంలో కన్నౌజ్ నుండి మొత్తం థార్ ఎడారి వరకు ఎక్కువగా ఇసుకలో తరుచూ కనిపించేవి.
చాలామంది వాటిని అవసరాన్ని ఆసరగా చేసుకుని వేటాడటంతో ఇప్పుడు వాటిని విలుప్త అంచుల దాకా తీసుకువచ్చింది.
వేటగాళ్లు, పక్షుల నుంచి తనను ఎలాగోలా తప్పించుకునే ఈ బల్లి, మనిషి నుంచి మాత్రం ప్రాణాలు కాపాడుకోలేకపోతోంది.
మిగతా అన్ని ప్రాణుల్లాగే దీన్లో కూడా కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వుపై మనిషి కన్ను పడింది. భారతదేశంలో ఈ బల్లులను వేటాడడంపై నిషేధం ఉంది.
మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో మాత్రం వీటికి మంచి డిమాండ్. ఇప్పటికీ అక్కడ విచక్షణారహితంగా వేటాడుతున్నారు.
శాండా బల్లుల కొవ్వు నుంచి తీసిన నూనెను సాండే నూనె అంటారు. నూనె అమ్మే షాపులు పాకిస్థాన్‌లోని కొన్ని దశాబ్దాల నుంచీ ఉన్నాయి.
అంగస్తంభన సమస్య ఉన్న వారికి వీటి నుంచి తీసిన సాండే నూనెతో సైకోథెరపీ ఇస్తే 60 నుంచి 70 శాతం మందికి నయం అవుతుందట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి