రోగనిరోధక శక్తిని పెంచడంలో తుమ్మి ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని మంచి గుణాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో ఉపయోగపడుతాయి.
వారంలో ఒక్కరోజైనా తుమ్మి కూరను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
నెలసరి సమస్యలు ఉన్నవారు, నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నా తుమ్మి కూర తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
శరీరంలో నొప్పులు, వాపులను అడ్డుకట్ట వేయడంలో తుమ్మి ఆకులు ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆకులతో చేసిన కషాయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా తుమ్మి ఆకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులున్న వారు ఆకుల రసాన్ని చర్మంపై రాసుకుంటే తగ్గిపోతుంది.
దగ్గు, జలుబు, ఆయసం వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు తుమ్మి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.