World Mental Health Day 2022: డిప్రెషన్‌ను రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చని మీకు తెలుసా? ఆసక్తికర విషయాలను వెల్లడించిన పరిశోధకులు..

|

Oct 11, 2022 | 2:33 PM

ఒక్కోసారి ఈ ఒడిదుడుకులకు మనసు కంగారుపడుతుంది. భయందోళనలకు గురౌతుంది. అప్పుడది జబ్బుపడుతుంది. ఈ స్థితి గుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వెళ్లవల్సిందే. కానీ కొన్ని మనసులు మరీ ఎక్కువగా కతల చెందుతాయి? దానికి సరైన వైద్యం ఏమిటో తెలుసా..? సాంత్వన నిచ్చే కమ్మని..

World Mental Health Day 2022: డిప్రెషన్‌ను రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చని మీకు తెలుసా? ఆసక్తికర విషయాలను వెల్లడించిన పరిశోధకులు..
Psychiatric Disorders
Follow us on

జీవితం చపలమైనది. దానికి స్థిరత్వం ఉండదు. అలాగే మార్పు అనేది సృష్టి సహజ స్వభావం. పరిణామక్రమంలో కొన్ని అడుగులు ముందుకు వెయ్యాల్సి వస్తుంది. మరోమారు వెనుకకు వేయాల్సి వస్తుంది. నిజానికి చలనశీలంలోనే పురోగతి ఉంటుంది. నిశ్చలంగా నిద్రించే చెరువుకు, నిరంతరం గలగలా ప్రవహించే గోదావరికి ఎంత తేడా ఉంటుందో నిజ జీవితంతో ఒక్కసారైనా గమనించి ఉంటారు. ఒక్కోసారి ఈ ఒడిదుడుకులకు మనసు కంగారుపడుతుంది. భయందోళనలకు గురౌతుంది. అప్పుడది జబ్బుపడుతుంది. ఈ స్థితి గుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వెళ్లవల్సిందే. కానీ కొన్ని మనసులు మరీ ఎక్కువగా కతల చెందుతాయి? దానికి సరైన వైద్యం ఏమిటో తెలుసా..? సాంత్వన నిచ్చే కమ్మని పలుకులు.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరిపై ఎవరికి శ్రద్ధ ఉంటుంది? ఎవరు ఎవరినీ గమనిస్తున్నారు గనుక? అందుకే మానసిక రుగ్మతలు నేటి తరాన్ని పట్టి పీడిస్తున్నాయి..

మెదడులో దీని ప్రభావం వల్లనే డిప్రెషన్..

చూసేందుకు ఆరోగ్యంగా కనిపించినంత మాత్రాన ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కాదు. వ్యక్తి జీవితంలో చిన్న చిన్న ఆనందాలు, స్వీయ సంతృప్తి నిచ్చే సంఘటనలు, విజయాలు, భావోద్వేగ ప్రశాంతత మానసిక సంతోషానికి కారణమవుతాయి. మంచి జీవితంపైనే మన మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా యాంగ్జైటీ, డిప్రెషన్‌లతో బాధపడేవారి సంఖ్య 25 శాతానికి పెరిగింది. మన జీవితాలు, కుటుంబాలు, ఆఫీసులు ప్రతీ చోట, ప్రతి ఒక్కరినీ మానసిక రుగ్మతలు ప్రభావితం చేస్తుంటాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అకాల మరణానికి గురవుతారని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇటువంటి వాళ్లు సగటు కంటే 20 సంవత్సరాలు ముందుగానే మరణిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

మానసిక రుగ్మతలకు మందులను సూచించే ముందు రక్త పరీక్షల (బ్లడ్‌ టెస్ట్) ద్వారా డిప్రెషన్‌ గుర్తించవచ్చని మీకు తెలుసా? ఐతే డిప్రెషన్‌ను ధృవపరిచే స్పష్టమైన ఏకరూప పరీక్ష అందుబాటులో లేదు. బాడీ ఇన్‌ఫ్లమేషన్‌, డిప్రెషన్‌కు మధ్య సంభావ్య సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.డిప్రెషన్ అనేది ఓ రకమైన ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి అని తాజా అధ్యయనంలో బయటపడింది. శరీరం, మెదడులో ఉద్భవించే ఇన్‌ఫ్లమేషన్‌ ఫలితంగా డిప్రెషన్‌కు దారి తీస్తుంది. హై-సెన్సిటివిటీ సి-రియాక్టివ్ ప్రోటీన్ (హెచ్‌ఎస్‌సిఆర్‌పి) అనేది మానసిక అనారోగ్యంతో సంబంధం ఉన్న ఇన్‌ఫ్లమేటరీ మార్కర్. హోమోసిస్టీన్ (homocysteine) అనే ఈ ఇన్‌ఫ్లమేటరీ కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లడం జరుగుతుంది. మహిళల్లో ప్రధానంగా ఎస్ట్రాడియోల్, ఈస్ట్రోజెన్ హార్మోన్ వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అదేవిధంగా తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు పురుషుల్లో డిప్రెషన్‌కు దారితీస్తుంది. మద్యపానం, డ్రగ్స్‌ వ్యసనాలు కూడా మానసిక అనారోగ్యానికి కారణం అవుతాయి.

ఇవి కూడా చదవండి

శరీరంలో ఈ పోషకాలు లోపించినా..

చర్మానికి ఉపయోగపడే విటమిన్ డి సూర్యరశ్మి వల్ల లభిస్తుందనే విషయం తెలిసిందే. విటమిన్ డి మరో ప్రయోజనం ఏంటంటే ఇది డిప్రెషన్‌ స్థాయిలను తగ్గుముకం పట్టేలా చేయడం. హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్ స్థాయిలు) డిప్రెషన్‌తో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. డిప్రెషన్‌కు కారణమయ్యే దీని నిర్వహన సక్రమంగా ఉండాలి. మాంసాహారంలో లభించే విటమిన్ B12 కూడా మానసిక సమస్యల నివారణలో కీలకపాత్ర వహిస్తాయి. మెగ్నీషియం కూడా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే డిప్రెషన్‌తో సహా అనేక న్యూరోసైకియాట్రిక్ సమస్యలు తలెత్తుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. జింక్ మానసిక ఆరోగ్యానికి అవసరమైన మరో ముఖ్య ఖనిజం. ఎందుకంటే ఇది మెదడు, నాడీ వ్యవస్థ పనితీరు, న్యూరోట్రాన్స్‌మిషన్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే ఈ విధమైన పోషకాలు, హార్మోన్లు, ప్రొటీన్ల లోపాలను ఆయా బ్లడ్‌ టెస్టుల ఆధారంగా మానసిక నిపుణులు కనుగొనడం జరుగుతుంది. వాటి ఫలితాల ఆధారంగా మందులను సిఫార్సు చేస్తారు.