ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంపై కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే. రోజువారీ బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది సరైన సమయానికి తినడం, నిద్రపోవడం గగనమైపోతుంది. చాలా మంది ఈ విధమైన అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా విశ్రాంతి లేకుండా గడుపుతున్నారు. దీంతో కొంతమందికి రాత్రిపూట కనీసం కంటి నిండా నిద్ర కూడా పట్టక ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు పాలలో మఖానా కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి, మఖానాను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఎందుకంటే మఖానాలో ప్రోటీన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. రాత్రి పడుకునే ముందు మఖానా కలిపిన పాలు తాగడం వల్ల ఎవరికైనా నిద్ర నాణ్యత మరింత మెరుగుపడుతుంది. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది అంత ప్రయోజనకరంగా ఉండదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కొంత మందికి మఖానా కలిపిన పాలు ఆరోగ్య సమస్యలను కలిస్తాయి. కడుపు ఉబ్బడం జరుగుతుంది. మఖానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తినడం వల్ల మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.
అలెర్జీలకు కారణం కావచ్చు. కొంతమందికి మఖానా తింటే అలెర్జీ తలెత్తి చర్మంపై దద్దుర్లు, కడుపు సమస్యలను కలిగిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు మఖానా తింటే, కేలరీలు తక్కువగా అందుతాయి. అయితే, మఖానాను ఎక్కువ మొత్తంలో పాలతో కలిపి తింటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంది.
ఒక పాన్ లో నెయ్యి వేడి చేసి, దానిలో మఖానా వేసి తేలికగా వేయించాలి. తరువాత మిక్సర్ గ్రైండర్ లో మఖానాను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు వేడి చేసి, దానిలో యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పాలలో మఖానీ పొడి వేసి 3-4 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. రుచి కోసం కాస్త తేనె జోడించి వేడిగా తాగొచ్చు.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.