Foods for Diabetes: ఈ ఫుడ్స్ మీ డైట్‌లో ఉంటే.. ఖచ్చితంగా డయాబెటీస్ కంట్రోల్ అవ్వాల్సిందే!

|

Aug 21, 2024 | 1:11 PM

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్‌తో బాధ పడుతున్నారు. షుగర్ వ్యాధి జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే.. జీవిత కాలం బాధ పడుతూనే ఉండాలి. ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినడానికి ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేయడానికి మందులు తీసుకున్నప్పటికీ ఫుడ్ కూడా సరైన విధంగా తీసుకోవాలి. లేదంటే బాడీలో డయాబెటీస్ లెవల్స్..

Foods for Diabetes: ఈ ఫుడ్స్ మీ డైట్‌లో ఉంటే.. ఖచ్చితంగా డయాబెటీస్ కంట్రోల్ అవ్వాల్సిందే!
Foods For Diabetes
Follow us on

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్‌తో బాధ పడుతున్నారు. షుగర్ వ్యాధి జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే.. జీవిత కాలం బాధ పడుతూనే ఉండాలి. ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినడానికి ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేయడానికి మందులు తీసుకున్నప్పటికీ ఫుడ్ కూడా సరైన విధంగా తీసుకోవాలి. లేదంటే బాడీలో డయాబెటీస్ లెవల్స్ అనేవి పెరిగి పోతాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు తీసుకునే ఆహారం, డ్రింక్స్‌పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కొన్ని రకాలైన ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాకరకాయ:

కాకర కాయ తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ మీ డైట్‌లో కాకర కాయతో చేసిన ఆహారాలు యాడ్ చేసుకోండి. కాకర కాయ రక్తంలోని చక్కెర స్థాయిలు ఒక్కటే సారి పెరగకుండా నియంత్రించడంలో సహాయ పడుతుంది. డయాబెటీస్‌తో బాధ పడేవారికి కాకర కాయ అనేది బెస్ట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మెంతులు:

చాలా మందికి తెలిసే ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధ పడేవారు మెంతులు తిన్నా కూడా చక్కెర లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కర స్థాయిలు ఒక్కటే సారి పెరగకుండా చేస్తుంది. మెంతులు ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క‌లో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉంటాయి. దాల్చిన చెక్కతో ఇరత అనారోగ్య సమస్యలన్ని కూడా తగ్గించుకోవచ్చు. జీవక్రియను మెరుగు పరుస్తుంది. ప్రతిరోజూ ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని టీ, కాఫీ, నీటితో కానీ ఆహారంతో పాటు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

బెండకాయలు:

డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలి అనుకునేవారు బెండకాయలను తినవచ్చు. ఇందులో గ్లైసెమిక్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో.. ఎక్కువగా తినలేరు. రక్తంలో చక్కెర శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రతి రోజూ మీ డైట్‌లో బెండకాయలను చేర్చుకోవడం వల్ల డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఉసిరి, పసుపు తీసుకున్నా షుగర్ వ్యాధి అనేది నియంత్రణలోకి వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..