Ankles Swelling: కాలి చీల మండలు ఉబ్బాయా.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి..

|

Jul 25, 2024 | 3:13 PM

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు. అందులోనూ గుండె నొప్పి, షుగర్, బీపీ, అధిక బరువు సమస్యలు సర్వ సాధారణమై పోయాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే చాలా మది గుండె నొప్పితో కుప్ప కూలిపోవడం చూస్తూనే ఉంటున్నాం. అందుకు సంబంధించిన వీడియోలు, వార్తలు నిత్యం వింటున్నాం. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా, ఒత్తిడికి గురై చాలా మంది హార్ట్ ఎటాక్‌తో..

Ankles Swelling: కాలి చీల మండలు ఉబ్బాయా.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి..
Ankles Swelling
Follow us on

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు. అందులోనూ గుండె నొప్పి, షుగర్, బీపీ, అధిక బరువు సమస్యలు సర్వ సాధారణమై పోయాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే చాలా మది గుండె నొప్పితో కుప్ప కూలిపోవడం చూస్తూనే ఉంటున్నాం. అందుకు సంబంధించిన వీడియోలు, వార్తలు నిత్యం వింటున్నాం. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా, ఒత్తిడికి గురై చాలా మంది హార్ట్ ఎటాక్‌తో అప్పటికప్పుడు చనిపోతున్నారు. కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యే ముందు మనలో చాలా రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా మానిటర్ చేస్తే ఆరోగ్య సమస్యల నుంచి జాగ్రత్త పడొచ్చు. హార్ట్‌ ఎటాక్‌కి గురయ్యే ముందు కాలి భాగంలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. వీటిని బట్టి కూడా మనం అవగాహన చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

* కాళ్లు తరచుగా నొప్పులు రావడం, కొద్ది దూరం నడిచినా, నిలుచున్న, మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నా, కాసేపు దూరం నడిచినా కాళ్లలో విపరీతమైన నొప్పులు కనిపిస్తాయి. ఇవి కూడా గుండె పోటుకు కారణం కావచ్చు.

* ఎందుకంటే గుండె నుంచి నేరుగా పాదాలకు కూడా నరాలు అనేవి ఉంటాయి. కాబట్టి గుండె ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కాళ్లలో కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

* అలాగే కాళ్ల చీల మండలు, అరి పాదాలు, పిరుదుల్లో తీవ్రంగా నొప్పులు ఉన్నా కూడా గుండె పోటుకు సంకేతమని అంటున్నారు.

* గుండె బలహీనంగా ఉన్న కారణంగా శరీర భాగాలకు రక్తం అనేది సరిగా పంప్ చేయదు. దీని వల్ల పాదాల్లో కూడా వాపు వస్తుంది.

* కాళ్లలో రక్త ప్రవాహం తగ్గడం వల్ల కూడా ఎక్కువగా తిమ్మిర్లు, జలదరింపులు కనిపిస్తాయి. గుండె పోటుకు ఇది కూడా లక్షణం కావచ్చు. కాబట్టి మీరు వెంటనే అప్రమత్తం అవ్వడం ముఖ్యం.

* వీటితో పాటు ఆందోళన, ఒత్తిడిగా, వాంతులు అవడం, అలసట, అధిక చెమట, శ్వాస సరిగా తీసుకోలేక పోవడం వల్ల కూడా గుండె పోటుకు సంకేతాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మీ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..