Diabetes: సరిగా నిద్ర పోవడం లేదా.. డయాబెటీస్ రావడం ఖాయం..

|

Jul 21, 2024 | 1:47 PM

నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతారు. ఒక రోజు సరిగా తినకపోయినా పర్వాలేదు కానీ.. రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే మాత్రం మీ బాడీలో జరిగే చేంజెస్ వెంటనే మీకు తెలిసిపోతాయి. నీరసం, అలసట, తలనొప్పి, వికారం, కళ్లు తిరగడం, కాళ్లు, చేతులు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి నిద్ర అనేది చాలా ముఖ్యం. సరిగా నిద్రపోకపోతే సాధారణ సమస్యలే కాదు.. దీర్ఘకాలిక వ్యాధులు ఖచ్చితంగా వచ్చే ప్రమాదం..

Diabetes: సరిగా నిద్ర పోవడం లేదా.. డయాబెటీస్ రావడం ఖాయం..
diabetes
Follow us on

నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతారు. ఒక రోజు సరిగా తినకపోయినా పర్వాలేదు కానీ.. రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే మాత్రం మీ బాడీలో జరిగే చేంజెస్ వెంటనే మీకు తెలిసిపోతాయి. నీరసం, అలసట, తలనొప్పి, వికారం, కళ్లు తిరగడం, కాళ్లు, చేతులు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి నిద్ర అనేది చాలా ముఖ్యం. సరిగా నిద్రపోకపోతే సాధారణ సమస్యలే కాదు.. దీర్ఘకాలిక వ్యాధులు ఖచ్చితంగా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా జరిగిన అధ్యయనాల ప్రకారం.. సరిగా నిద్రపోని వారిలో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందట. నిద్ర సమయం తగ్గినా కూడా డయాబెటీస్ బారిన పడే ముప్పు ఉందని చెబుతున్నారు. మీ పనులకు, వృత్తికి ఎంత వ్యాల్యూ ఇస్తున్నారో.. నిద్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని అంటున్నారు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. వచ్చే నిద్రను ఆపుకుని మరీ ఫోన్లు, టీవీలు చూస్తారు. ఇలా చేయడం వల్ల షుగర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ శాతం ఉంది.

అసలు ఎన్ని గంటలు నిద్రపోవాలి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం.. ప్రతి ఒక్కరికి 8 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఎంత లేదన్నా 7 గంటలు అయినా ప్రశాంతంగా పడుకోవాలి. చిన్న పిల్లలకు, వృద్ధులు మరింత ఎక్కువ సమయం పడుకోవాలి. అసలు ఈ మధ్య ఎవరైనా ఇన్ని గంటలు నిద్రపోతున్నారా? మీరు ఏ సమయానికి పడుకుంటున్నారు? ఎప్పుడు లేస్తున్నారు? అనేది చూసుకోవాలి. ఉదయం త్వరగా లేవాలి అంటే.. రాత్రికి త్వరగా పడుకోవాలి. రాత్రి 7 గంటల లోపే మీ భోజనం ముగించాలి. ఇలా మీకు మీరే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

షుగర్ ఎలా వస్తుంది?

ఇప్పుడు కాలంలో స్క్రీనింగ్ సమయం అనేది బాగా ఎక్కువైంది. ముఖ్యంగా యువత సెల్ ఫోన్‌కు బానిసలుగా మారారు. సోషల్ మీడియా వీడియోలు, వెబ్ సిరీస్‌లు చూసుకుంటూ నిద్రని పాడు చేసుకుంటున్నారు. ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంపై ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. తిన్న ఆహారం సరిగా అరగదు. ఆహారం జీర్ణం కావడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దీంతో రక్త ప్రసరణపై కూడా ఒత్తిడి పడి.. రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ఇలా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..