Interesting: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకుంటే.. జరిగేది ఇదే!

| Edited By: Janardhan Veluru

Jul 28, 2024 | 7:17 PM

జీవితం అన్నాక ప్రతీ ఒక్కరికి కోరికలు ఉండటం చాలా సహజం. వీటిని సాధించడానికి చాలా మంది తెగ కష్ట పడుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ విజయమే వరించదు. కష్ట నష్టాలను కూడా ఎదుర్కోవాలి. కానీ కొన్ని రకాల చిట్కాలను ట్రై చేస్తే.. ఖచ్చితంగా కాస్త ప్రయోజనం ఉంటుంది. మనం కిచెన్‌లో ఉపయోగించే వాటితో కూడా మన కోరికలను నెరవేర్చుకోవచ్చు. వీటితో కేవలం ఆరోగ్య లాభాలే కాకుండా మన కోరికలను కూడా తీర్చుకోవచ్చు. ఏంటి? నమ్మశక్యంగా లేదు కదా..

Interesting: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకుంటే.. జరిగేది ఇదే!
Interesting
Follow us on

జీవితం అన్నాక ప్రతీ ఒక్కరికి కోరికలు ఉండటం చాలా సహజం. వీటిని సాధించడానికి చాలా మంది తెగ కష్ట పడుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ విజయమే వరించదు. కష్ట నష్టాలను కూడా ఎదుర్కోవాలి. కానీ కొన్ని రకాల చిట్కాలను ట్రై చేస్తే.. ఖచ్చితంగా కాస్త ప్రయోజనం ఉంటుంది. మనం కిచెన్‌లో ఉపయోగించే వాటితో కూడా మన కోరికలను నెరవేర్చుకోవచ్చు. వీటితో కేవలం ఆరోగ్య లాభాలే కాకుండా మన కోరికలను కూడా తీర్చుకోవచ్చు. ఏంటి? నమ్మశక్యంగా లేదు కదా.. అయినా ఇది నిజం. మసాలా దినుసులను దిండు కింద పెట్టుకుని నిద్ర పోవడం వల్ల మన కోరికలన్నీ తీరతాయి. మరి ఎలాంటి వస్తువును ఎలాంటి కోరికలు నిజమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

యాలకులు:

యాలకులతో రుచి, ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. జ్యోతిష్య పరంగా మ్యాజికల్ ప్రాపర్టీలు కూడా కలి ఉంటాయి. వీటి కనుక రాత్రి పూట పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని పడుకుంటే.. డబ్బు సమస్యలు తీరతాయి. యాలకులు డబ్బును బాగా ఆకర్షిస్తాయి. ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం దాల్చిన చెక్కతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాల్చిన చెక్క ముక్కను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని నిద్ర పోతే.. మీరు కోరుకున్న శ్రేయస్సు లభిస్తుంది. మీలో ఉండే నెగిటివ్‌నెస్ దూరం అవుతుంది

ఇవి కూడా చదవండి

లవంగాలు:

లవంగాలతో కూడా మీరు కోరకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చు. జోతిష్య పరంగా లవంగాలు కూడా చాలా ఉపయోగ పడతాయి. లవంగాలను దిండు కింద పెట్టుకుని నిద్ర పోవడం వల్ల ఇంట్లో, ఆఫీసు‌లో ఉండే చెడు దృష్టి అంతా పోతుంది.

నట్‌మగ్:

నట్ మగ్‌తో కూడా కొన్ని రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. నట్‌మగ్‌ని దిండు కింద పెట్టుకుని పడుకుంటే.. జీవితంలో ఉండే సమస్యలన్నీ చాలా త్వరగా తీరుతాయి. మీ ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. మీకు రావాల్సిన డబ్బు మొత్తం మీ చేతికి చేరుతుంది.

స్టార్ ఫ్లవర్:

స్టార్ ఫ్లవర్‌నే అనాస పువ్వు అని కూడా అంటారు. ఈ ఫ్లవర్‌తో కూడా మనం చాలా రకాల సమస్యలను తగ్గించు కోవచ్చు. ఈ పువ్వును దిండు కింద పెట్టుకుని పడుకుంటే సరిపోతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోయి.. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకు మంచి నిద్ర కూడా వస్తుంది.

(NOTE: పాఠకుల ఆసక్తి మేరకు జనం నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథనాన్ని పాఠకులకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు నిజమని నిర్ధారించే ఆధారాలు లేవు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..