పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు.. వైద్యుల షాకింగ్ హెచ్చరికలు!
మహిళల జీవితంలో నెలసరి (Periods) అనేది ఒక సహజమైన జీవక్రియ. అయితే, ఇంట్లో ఏదైనా పెళ్లిళ్లు, పూజలు, పండగలు లేదా దూర ప్రయాణాలు ఉన్నప్పుడు చాలామంది మహిళలు పీరియడ్స్ రాకుండా వాయిదా వేసే మాత్రలను (Period Delay Pills) వాడుతుంటారు. డాక్టర్ల సలహా లేకుండా మెడికల్ షాపుల్లో దొరికే ఈ హార్మోన్ మాత్రలను వాడటం వల్ల మహిళల ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటుందో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఆచార్య మనీష్ జీ వివరించారు.

మహిళల జీవితంలో నెలసరి (Periods) అనేది ఒక సహజమైన జీవక్రియ. భారతీయ సంస్కృతిలో పూజలు, పండుగలు, శుభకార్యాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి సమయాల్లో నెలసరి (పీరియడ్స్) వస్తే ఆయా వేడుకలకు దూరంగా ఉండాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది మహిళలు, యువతులు పీరియడ్స్ తేదీని ముందుకు జరపడానికి లేదా ఆలస్యం చేయడానికి పీరియడ్ డిలే పిల్స్ (Period Delay Pills) వాడుతుంటారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్‌లోనైనా ఇవి సులభంగా దొరుకుతుండటంతో, వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ మాత్రలను ఇష్టానుసారంగా వాడటం వల్ల 18 ఏళ్ల ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఉదంతం ఇటీవల తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, నెలసరిని వాయిదా వేసే మాత్రల వెనుక ఉన్న ప్రాణాంతక ముప్పుల గురించి గైనకాలజిస్టులు, వాస్కులర్ సర్జన్లు చేస్తున్న హెచ్చరికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తం గడ్డకట్టే ప్రమాదం (Thrombosis):
ఆచార్య మనీష్ జీ ప్రకారం, .. సహజంగా నెలసరిని వాయిదా వేసే మాత్రలలో ప్రొజెస్టిరాన్ లేదా ఈస్ట్రోజెన్ వంటి కృత్రిమ హార్మోన్లు ఉంటాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను ఒక్కసారిగా మార్చేస్తాయి. వైద్యుల ప్రకారం.. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల రక్తం చిక్కగా మారి, రక్తనాళాల లోపల గడ్డకట్టే (Thrombosis) స్వభావం పెరుగుతుంది. దీనిని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అంటారు. కాళ్లలోని సిరల్లో ఏర్పడే ఈ రక్తపు గడ్డలు క్రమంగా గుండె, మెదడు లేదా ఊపిరితిత్తుల వరకు చేరుకుంటాయి. ఊపిరితిత్తులలోని ధమనులకు రక్తం సరఫరా ఆగిపోవడాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఇది తక్షణ శ్వాసకోస సమస్యలకు, ఆకస్మిక మరణానికి దారితీస్తుంది.
కనిపించే ప్రధాన సైడ్ ఎఫెక్ట్స్:
ఈ మాత్రలను తరచూ వాడటం వల్ల తక్షణమే కాకుండా దీర్ఘకాలికంగా కూడా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
క్రమం తప్పే రుతుచక్రం: ఈ మాత్రలు వేసుకున్న తర్వాత వచ్చే నెలల్లో పీరియడ్స్ సమయానికి రాకపోవడం (Irregular Periods) లేదా ఒకే నెలలో రెండుసార్లు రావడం జరుగుతుంది.
శారీరక అసౌకర్యం: తీవ్రమైన తలనొప్పి, వాంతులు వచ్చినట్లు ఉండటం (వికారం), మూడ్ స్వింగ్స్ (చిరాకు) మరియు రొమ్ములలో విపరీతమైన నొప్పి వస్తాయి.
బరువు పెరగడం & పింపుల్స్: హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై మొటిమలు రావడం, అకస్మాత్తుగా బరువు పెరగడం మరియు శరీరం ఉబ్బినట్లు అనిపించడం జరుగుతుంది. మీరు పడుకునే పొజిషన్ మీ గుణగణాలను చెప్పేస్తుందని తెలుసా? సైకాలజీ ఏం చెబుతోందంటే..!
అంతర్లీన సమస్యలు ఉన్నవారికి మరింత డేంజర్:
ఈ హార్మోన్ల మాత్రలు అందరి శరీరాలపై ఒకేలా పనిచేయవు. ముఖ్యంగా కింది సమస్యలు ఉన్నవారు ఈ మాత్రలు వేసుకోవడం అత్యంత ప్రమాదకరం:
అధిక రక్తపోటు (బీపీ): హై బీపీ ఉన్నవారిలో ఈ మాత్రలు స్ట్రోక్ (పక్షవాతం) లేదా గుండెపోటు వచ్చేలా చేస్తాయి.
వయస్సు, అలవాట్లు: 35 ఏళ్లు పైబడిన మహిళలు, లేదా ధూమపానం (Smoking) చేసే అలవాటు ఉన్నవారు ఈ మాత్రలు వాడితే రక్తం గడ్డకట్టే ముప్పు పదిరెట్లు పెరుగుతుంది.
ఇతర వ్యాధులు: థైరాయిడ్, డయాబెటిస్ లేదా కాలేయ (Liver) వ్యాధులు ఉన్నవారిపై ఈ మందుల ప్రభావం విషపూరితంగా మారవచ్చు.
View this post on Instagram
వైద్యుల సలహా తప్పనిసరి:
పండుగలు, ఫంక్షన్లు మళ్లీ మళ్లీ వస్తాయి. కానీ, ప్రాణం ఒక్కసారే పోతుందని వైద్యులు గుర్తుచేస్తున్నారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేయాల్సి వస్తే, సొంత వైద్యం అస్సలు చేయకూడదు. ముందుగా ఒక గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, మీ ఆరోగ్య చరిత్రను (Medical History) బట్టి వారు సూచించే సురక్షితమైన మోతాదులను మాత్రమే వాడాలి. ఈ మాత్రలు వేసుకున్న తర్వాత విపరీతమైన తలనొప్పి, ఛాతీలో నొప్పి, కాలు వాపు లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర చికిత్స అందించే ఆసుపత్రికి వెళ్లడం ఎంతో ముఖ్యం.




