Iron Foods: కళ్లు తిరుగుతున్నట్టు తరచుగా అనిపిస్తుందా.. ఇదే లోపం!

|

Jul 21, 2024 | 3:23 PM

శరీరం ఆరోగ్యంగా, ధృఢంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కావాలి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్ వంటివి అన్నీ అందితేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించగలం. వీటిలో ఏది తక్కువైనా.. ఎక్కువైనా సమస్యలు తప్పవు. చాలా మంది ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరానికి ఐరన్ అనేది చాలా అవసరం. రక్త హీనత సమస్యను నివారించడంలో ఐరన్ ఖచ్చితంగా కావాలి. అదే విధంగా అవయవాలు మెరుగుగా..

Iron Foods: కళ్లు తిరుగుతున్నట్టు తరచుగా అనిపిస్తుందా.. ఇదే లోపం!
Iron Foods
Follow us on

శరీరం ఆరోగ్యంగా, ధృఢంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కావాలి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్ వంటివి అన్నీ అందితేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించగలం. వీటిలో ఏది తక్కువైనా.. ఎక్కువైనా సమస్యలు తప్పవు. చాలా మంది ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరానికి ఐరన్ అనేది చాలా అవసరం. రక్త హీనత సమస్యను నివారించడంలో ఐరన్ ఖచ్చితంగా కావాలి. అదే విధంగా అవయవాలు మెరుగుగా పని చేయాలన్నా ఐరన్ ఖచ్చితంగా అవసర పడుతుంది. అందుకే ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. మరి ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్షణాలు ఇవే:

శరీరంలో ఐరన్ తగ్గింది అనడానికి ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలసట, బలహీనత, చిన్న పనులకే అలిసి పోవడం, తల తిరుగుడం, తల నొప్పి, పసుపు చర్మ వంటివి ఐరన్ తగ్గింది అనడానికి సూచనలు.

బెల్లం తినండి:

బెల్లంలో ఐరన్ అనేది అధిక శాతంలో లభిస్తుంది. కాబట్టి ఐరన్ లోపంతో ఉండేవారు త్వరగా రికవరీ అవడంలో బెల్లం ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ప్రతి రోజూ చిన్న ముక్క బెల్లం తింటే రక్తం అనేది బాగా పడుతుంది. దీంతో రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. అంతే కాకుండా బెల్లం తినడం వల్ల కండరాలు, ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బీట్ రూట్:

బీట్ రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క బీట్ రూట్‌తో ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. కాబట్టి వారంలో ఒక్కసారైనా బీట్ రూట్ తింటూ ఉండండి. ఐరన్ లోపంతో బాధ పడేవారు బీట్ రూట్ తింటే చక్కగా రక్తం పడుతుంది. అంతే కాకుండా మీ చర్మం కూడా గ్లో అవుతుంది. చాలా మందికి బీట్ రూట్ తినడం ఇష్టం ఉండదు. బీట్ రూట్ తినడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

పాలకూర:

ఆకు కూరల్లో పాల కూర కూడా ఒకటి. పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. ఐరన్ లోపంతో బాధ పడేవారు కూడా పాల కూర తీసుకుంటే.. ఈ సమస్య దూరమవుతుంది. ఐరన్ లోపంతో బాధ పడేవారు పాలకూరను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

డ్రై ఫ్రూట్స్:

ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఎన్నో సమస్యలకు పెట్టొచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు, మంచి కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి ఐరన్‌ లోపంతో ఉండే వారు.. మీ డైట్‌లో వీటిని యాడ్ చేసుకోండి. ముఖ్యంగా గుమ్మడి గింజలు తింటే మరింత మంచిది.

విటమిన్ సి ఫుడ్స్:

ఐరన్ లోపంతో బాధ పడేవారు విటమిన్ సీ ఫుడ్స్‌ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే శరీరం ఐరన్‌ గ్రహించేలా చేయడంలో విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. కాబట్టి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, ఆహారం తీసుకోండి. అంతే కాకుండా రెడ్ మీట్, ఉల్లిపాయలు, బచ్చలి కూరలు, కూరగాయలు తీసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..