పెద్ద పేగు కేన్సర్ ను గుర్తించే మినీరోబో.. ఫలించిన లండన్ సైంటిస్టుల కృషి

పెద్దపేగు కేన్సర్ ట్రీట్ మెంట్ లో  వ్యాధిని  గుర్తించేందుకు  ఇప్పటివరకు అనుసరిస్తున్న ఎండోస్కోపీ తదితర విధానాలకు భిన్నంగా  లండన్ లీడ్స్ యూనివర్సిటీ సైంటిస్టులు  సరికొత్త పరికరాన్ని కనుగొన్నారు. పెద్దపేగుకు సోకే కేన్సర్  వ్యాధిని గుర్తించడంలో సహకరించే  అతిచిన్న రోబోటిక్ క్యాప్సుల్ ను సైంటిస్టులు తయారు చేశారు. సైంటిస్టులు తయారుచేసిన మినీ రోబోను  సోనోపిల్ గా పిలుస్తున్నారు. ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరుకుని మైక్రో అల్ట్రా సౌండ్ చిత్రాలను తీసి పంపిస్తుంది. ఇలా పేగు లోపలి భాగంలో ఫోటోలు […]

పెద్ద పేగు  కేన్సర్ ను గుర్తించే మినీరోబో.. ఫలించిన లండన్ సైంటిస్టుల కృషి
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2019 | 3:18 PM

పెద్దపేగు కేన్సర్ ట్రీట్ మెంట్ లో  వ్యాధిని  గుర్తించేందుకు  ఇప్పటివరకు అనుసరిస్తున్న ఎండోస్కోపీ తదితర విధానాలకు భిన్నంగా  లండన్ లీడ్స్ యూనివర్సిటీ సైంటిస్టులు  సరికొత్త పరికరాన్ని కనుగొన్నారు. పెద్దపేగుకు సోకే కేన్సర్  వ్యాధిని గుర్తించడంలో సహకరించే  అతిచిన్న రోబోటిక్ క్యాప్సుల్ ను సైంటిస్టులు తయారు చేశారు.

సైంటిస్టులు తయారుచేసిన మినీ రోబోను  సోనోపిల్ గా పిలుస్తున్నారు. ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరుకుని మైక్రో అల్ట్రా సౌండ్ చిత్రాలను తీసి పంపిస్తుంది. ఇలా పేగు లోపలి భాగంలో ఫోటోలు తీయడం ద్వారా వ్యాధి యొక్క తీవ్రతను, కణాల్లో జరిగే మార్పును  వైద్యులు సులువుగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వైద్య చరిత్రలోనే ఇది  నూతన ఆవిష్కరణగా  సోనో పిల్ రూపొందించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే  రోజుల్లో సోనోపిల్స్ టెక్నాలజీ అత్యంత కీలకంగా మారబోతుందని  అలాగే ఈ టెక్నాలజీ వినియోగించడం ద్వారా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం కలుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

21 మిల్లీమీటర్ల వెడల్పు, 39 మిల్లీ మీటర్ల పొడవు కలిగిన అతిచిన్న పరికరం సోనోపిల్. దీనిలో ఎల్ఈడీ లైట్, అతిచిన్న కెమెరా వంటివి అమర్చారు.  దీనికి  ఫ్లెక్సిబుల్ కేబుల్ అనుసంధానింపబడి ఉండటంతో పెద్దపేగు లోపలికి సులువుగా చేరుకుని నిర్దేశిత ప్రదేశాన్ని పరిశీలించి  అల్ట్రాసౌండ్ చిత్రాలను తీసేందుకు సోనోపిల్ సహకరిస్తుంది.

ఒకవైపు  గ్యాస్ట్రో ఇంటర్ స్టెయినల్ సమస్యలతో ప్రపంచ వ్యాప్తంగా 8 మిలియన్ల మంది మరణిస్తున్నారని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దీని పరిష్కారం దిశగా లండన్ లీడ్స్ యూనివర్సిటీ సైంటిస్టులు తాజాగా తయారు చేసిన సోనో పిల్ మినీ రోబోను రూపొందించారు. ఇది  వైద్య చరిత్రలో మరిన్ని అద్భుతాలు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఇది అందుబాటులోకి రావడానికి మరికొంత సమయంపట్టే అవకాశముంది.