Basil: సరికొత్త రికార్డ్స్‌ సృష్టించిన తులసి మొక్క.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

Nov 19, 2021 | 6:00 AM

Basil Farming: పూర్వకాలంలో చాలా మంది ప్రజలు తమ ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను ఉంచేవారు. కాలక్రమేణా ఈ పద్దతి తగ్గిపోయింది. తులసి మొక్కని ఎవ్వరూ

Basil: సరికొత్త రికార్డ్స్‌ సృష్టించిన తులసి మొక్క.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Tulsi Plant
Follow us on

Basil Farming: పూర్వకాలంలో చాలా మంది ప్రజలు తమ ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను ఉంచేవారు. కాలక్రమేణా ఈ పద్దతి తగ్గిపోయింది. తులసి మొక్కని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే కరోనా వల్ల దీని ప్రాధాన్యత పెరగడం మళ్లీ ప్రారంభమైంది. తులసిని ఆయుర్వేద, యునాని వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. కరోనా కాలంలో ప్రజలు దీని కషాయాన్ని తాగడం అలవాటు చేసుకున్నారు. తద్వారా రోగనిరోధక శక్తి బాగుంటుంది. ఈ సంవత్సరం ముంబై మున్సిపల్ నర్సరీ నుంచి 52,000 కంటే ఎక్కువ తులసి మొక్కలు అమ్ముడయ్యాయి. ఇది ఒక రికార్డు. తులసి మొక్కలు ఇంతగా ఎప్పుడు అమ్ముడుపోలేదు.

ఇప్పుడు ఈ మొక్క ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సాధారణంగా ముంబైలో ఏటా 30 నుంచి 32 వేల తులసి మొక్కలు మాత్రమే అమ్ముడవుతాయని బీఎంసీలోని గార్డెన్ డిపార్ట్‌మెంట్ హెడ్ తెలిపారు. కానీ ఈ ఏడాది దాదాపు రెట్టింపు అయింది. ఎందుకంటే తులసి మొక్క ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.కరోనా ద్వారా అందరూ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రజలను రక్షించేందుకు కొన్ని చోట్లు ఉచితంగా తులసి మొక్కలను పంపిణీ చేశారు కూడా..

తులసి మొక్క అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు రైతు సోదరులు తులసి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. దీని సాగుకు 20-25 వేల రూపాయలు ఖర్చు చేస్తే మూడు-నాలుగు నెలల తర్వాత 2.5 నుంచి 3 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఆయుర్వేద మందుల తయారీ కంపెనీల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కొందరు రైతుల బృందం తులసి మొక్కను సాగు చేసి బాగా సంపాదిస్తున్నారు.

Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్‌ టైర్‌.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

Indian Railway: అలసిపోయిన ప్రయాణికుల కోసం కొత్త సేవలు.. విశ్రాంతి తీసుకోవడానికి వీటి ఏర్పాటు..