Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

|

Dec 25, 2024 | 1:47 PM

తెల్లగా నిగనిగలాడే ముల్లంగి చలికాలంలో అధికంగా మార్కెట్లో కనిపిస్తాయి. ఈ సీజనల్ దుంపకూరల్లో మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ముల్లంగి రుచికి అంత బాగోదు. కాస్త వెగటుగా ఉంటుంది. దీంతో చాలా మంది దీనిని తీసుకోవడానికి ఇష్టపడరు..

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
Radish
Follow us on

శీతాకాలంలో దొరికే సీజనల్‌ కూరగాయల్లో ముల్లంగి ఒకటి. అయితే చలికాలంలో ముల్లంగి తినడం మంచిదా? లేదా? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. నిజానికి, ముల్లింగితో చేసిన ఆహారాలు ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. కొంతమందికి ముల్లంగి తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు సమస్యలు వస్తాయి. అయితే చలికాలంలో తింటే మరిన్ని సమస్యలు వస్తాయని భయపడి దీనికి దూరంగా ఉంటారు. ఉబ్బరం సమస్యలు లేకుండా ముల్లంగిని ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

గ్యాస్, ఉబ్బరం లేకుండా ముల్లంగిని తినడానికి మార్గాలివిగో..

  • ముల్లంగిని కట్ చేసిన తర్వాత వంట చేసే ముందు సుమారు 30 నిమిషాలు చల్లటి నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అపానవాయువుకు కారణం కాదు.
  • ముల్లంగిని సులభంగా జీర్ణం చేయడానికి సుగంధ ద్రవ్యాలు అందులో వినియోగించడం మరో ఉత్తమ మార్గం. తురిమిన అల్లం, వాము, పుదీనా వంటి వాటిని ముల్లంగి వంటకాల్లో వినియోగించాలి.
  • ప్రోబయోటిక్ ఫుడ్స్ తో పాటు ముల్లంగిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహించడానికి సహాయపడతాయి.
  • ముల్లంగిలో పోషకాలు ఉన్నప్పటికీ, వీటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల ఉబ్బరం, జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. అందువల్ల ఖాళీ కడుపుతో తినకపోవడమే మంచిది.
  • ముల్లంగిని పూర్తిగా ఉడికించడం వల్ల గ్యాస్, ఉబ్బరం లేదా అపానవాయువు కలిగించే పదార్ధాలు తొలగిపోతాయి. అందుకే వీటిని పూర్తిగా ఉడికించాలి. ఇలా తీసుకుంటే ఎలాంటి సమస్య రాదు.

వర్షాకాలం, శీతాకాలంలో దొరికే దుంపకూరల్లో ముల్లంగి చాలా ప్రత్యేకం. రుచికి కొంచెం వెగటుగా ఉండే మాట కూడా నిజమే. అయితేనేం.. ఇందులో పొటాషియం, పీచు, జింక్‌, భాస్వరం, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు వంటి పోషకాలు విస్తారంగా ఉంటాయి. ఇంత మంచి పోషకాహారం కనుకనే చాలామంది తమ ఆహారంలో దీనిని తప్పక చేర్చుకుంటారు. కూర, చారు, పచ్చడి, సలాడ్‌.. ఇలా ముల్లంగితో ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.