Breast Milk Pump: బ్రెస్ట్ మిల్క్ పంప్ యూజ్ చేయడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

|

Aug 06, 2024 | 1:27 PM

బిడ్డకు తల్లికి మధ్య ఉండే అనుబంధమే వేరు. పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు తల్లులు. వారి పట్ల ప్రత్యేకమైన కేర్ తీసుకుంటూ ఉంటారు. అందులోనూ బిడ్డకు తల్లి పాలు చాలా ముఖ్యం. సాధారణ మిల్క్ కంటే.. బ్రెడ్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల పిల్లలు మరింత ఆరోగ్యకరంగా ఉంటారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల శిశువు, తల్లికి ఇద్దరికీ ప్రయోజనాలు లేక పోలేదు. శిశువుకు పాలు పట్టడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్రెస్ట్ మిల్క్..

Breast Milk Pump: బ్రెస్ట్ మిల్క్ పంప్ యూజ్ చేయడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Breast Milk Pump
Follow us on

బిడ్డకు తల్లికి మధ్య ఉండే అనుబంధమే వేరు. పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు తల్లులు. వారి పట్ల ప్రత్యేకమైన కేర్ తీసుకుంటూ ఉంటారు. అందులోనూ బిడ్డకు తల్లి పాలు చాలా ముఖ్యం. సాధారణ మిల్క్ కంటే.. బ్రెడ్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల పిల్లలు మరింత ఆరోగ్యకరంగా ఉంటారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల శిశువు, తల్లికి ఇద్దరికీ ప్రయోజనాలు లేక పోలేదు. శిశువుకు పాలు పట్టడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్రెస్ట్ మిల్క్ పంప్స్ అనేవి బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది తల్లులు వీటిని ఉపయోగిస్తున్నారు. తల్లి పనులు మీద లేదా ఉద్యోగానికి వెళ్లే సమయంలో బిడ్డలకు తమ పాలు అందజేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ బ్రెస్ట్ మిల్క్ పంప్స్ ఉపయోగించడం మంచి దేనా? లేక పిల్లలకు నేరుగా పాలు పడితే మంచిదా అనే ఆలోచన ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఈ విషయంపై నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెస్ట్ మిల్క్ పంప్ అంటే ఏంటి..

నవ జాత శిశువుకు ఆరు నెలల వరకు తల్లి పాలు పాత్రమే ఆహారం. శిశువుకు ఆహారంగా తల్లి పాలు ఇవ్వడం అనేది సర్వ సాధారణం. తల్లి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు, తల్లికి మధ్య అనుబంధం అనేది మరింత పెరుగుతుంది. అంతేకాకుండా శిశువుకు అందాల్సిన పోషకాలు కూడా అందుతాయి. దీని వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి అనేది బాగా బల పడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎటాక్ చేయకుండా ఉంటాయి. అయితే ఎవరికైనా సరే పనులు అనేవి చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో తల్లితో పాటు శిశువులను తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. మరి కొందరు మహిళలు ఉద్యోగాల నిమిత్తం పనులకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో బిడ్డకు పాలు అందించడం కోసం ఈ బ్రెస్ట్ మిల్క్ పంప్స్ ఉపయోగిస్తున్నారు.

పోషకాలు అందుతాయి..

బ్రెస్ట్ పంప్స్ ద్వారా తల్లి రొమ్ము నుంచి పాలను తీసి.. నిల్వ చేసి శిశువుకు ఆహారంగా ఇస్తారు. అయితే ఈ పంప్స్ ద్వారా పాలు ఒకటే సారి ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. దీని వల్ల తల్లి రొమ్ము అనేది ఖాళీ అవుతుంది. అలా కాకుండా పంప్ వాడినా కూడా సరైన పద్దతి ఉపయోగిస్తే.. తల్లి పాల సరఫరా అనేది పెరుగుతుంది. బయట పోత పాలు కంటే.. తల్లి పాలే ఇవ్వడం వల్ల బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. పోషకాలు కూడా అందుతాయి. అయితే ఈ పంప్ వాడే ముందు వైద్యుల సలహా తీసుకుంటే చాలు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..