AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నార్మల్ ఏసీ VS డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ.. పెర్ఫార్మన్స్‌లో ఏది బెస్ట్‌.. దేనికి తక్కువ కరెంటు కాలుతుంది

Normal AC vs Dual Inverter AC: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇక తెలుగురాష్ట్రాల్లో పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండ వేడ నుంచి తట్టుకోవాలంటే ఇంట్లో ఏసీ ఉండాల్సిందే. అయితే మార్కెట్‌లో అనేక రకాలు ఏసీలు ఉన్నాయి. వాటిలో డ్యూయల్ ఇన్వర్టర్ AC , నార్మల్ AC రెండు కూడా ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే వీటి విషంలో అందిరికి ఉన్న డౌట్ ఏమిటంటే రెండింటిలో ఏది బెస్ట్ అని. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నార్మల్ ఏసీ VS డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ.. పెర్ఫార్మన్స్‌లో ఏది బెస్ట్‌.. దేనికి తక్కువ కరెంటు కాలుతుంది
Normal Ac Vs Dual Inverter Ac
Anand T
|

Updated on: May 05, 2026 | 4:12 PM

Share

తెలుగురాష్ట్రాల్లో సూర్యుడు శిశ్వరూపం చూపిస్తున్నారు. ఈ సూర్యుడి వేడి నుంచి తట్టుకోవాలంటే ఇంట్లో కచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. అయితే మార్కెట్‌లో చాలా రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా డ్యూయల్ ఇన్వర్టర్ AC , నార్మల్ AC లలో ఏది కొనాలి, ఏది మంచి ఫర్మామెన్స్ ఇస్తుందని చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. అయితే నార్మల్ AC అనేది పూర్తిగా ఆన్‌ అయిన తర్వాత మన రూమ్‌ మొత్తాన్ని చల్లబరుస్తుంది. ఆ తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఒక వేళ రూమ్‌లో మళ్లీ వేడి పెరిగితే ఏసీ మళ్లీ అన్ అవుతుంది. కానీ డ్యూయల్ ఇన్వర్టర్ AC మాత్రం మీ గది టెంపరేచర్ ఆధారంగా స్పీడ్‌ను మార్చుకుంటుంది. అయితే ఈ రెండు రూమ్‌ను కూల్ చేస్తున్నప్పటికీ వాటి ఉపయోగాల్లో మాత్రం తేడాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

నార్మల్ ఏసీ వర్సెస్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ

నార్మల్ ఏసీ: నార్మల్‌ ఏసీ అనేది మన ఇంట్లో ఉండే స్విచ్ ఆన్ ఆఫ్‌గా పనిచేస్తుంది. మన రూమ్‌లో ఉన్న టెంపరేచర్‌ను బట్టి అది రన్‌ అవుతుంది. ఒక వేళ మీ రూమ్‌ వాతావరణం వేడిగా ఉంటే.. ఇది ఆటోమెటిక్‌గా ఆన్‌అవుతుంది. రూమ్‌ మొత్తం కూల్ అయిన తర్వాత మళ్లీ దానంతట అదే ఆఫ్ అవుతుంది. అయితే ఇలా మళ్లీ మళ్లీ ఆన్ ఆఫ్‌ ఆవ్వడం వల్లా కరెంటు బిల్లు పెరగడమే కాకుండా గది ఉష్ణోగ్రతల్లోనూ హెచ్చు తగ్గులు ఏర్పడుతాయి. దీని వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవవచ్చు.

డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ: ఇది నార్మల్ ఏసీలా కాదు రూమ్‌ ఉష్ణోగ్రతను బట్టి దానంతటనే స్పీడ్‌ను మార్చుకుంటూ ఉంటుంది. కానీ పూర్తిగా ఆఫ్ అవ్వదు. మీ రూమ్‌కు ఎంత కూలింగ్ కావాలో దాన్ని బట్టి స్పీడ్‌ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి రూమ్‌లో టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. అలాగే కరెంటు వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.

రెండింటిలో ఏది బెస్ట్

నార్మల్‌ ఏసీలో మళ్లీ మళ్లీ ఆన్‌–ఆఫ్‌ అవ్వడం వల్ల రూమ్‌లో కొన్నిసార్లు ఎక్కువగా చల్లగా లేదా వేడిగా అనిపిస్తుంది అంతేకాకుండా అవుట్‌డోర్ యూనిట్‌లో సౌండ్, వైబ్రేషన్ వస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది. అదే డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అయితే ఇది చాలా సైలెంట్‌గా స్వింగ్ అవుతుంది. వీటిలో రెండు రోటర్లు ఉండటం వల్ల ఒకదానిని మరొకటి బ్యాలన్స్ చేస్తూ పనిచేస్తాయి. దీని వల్ల ఎక్కువ వైబ్రేషన్ ఉండదు. ఇవి రూమ్‌ను స్పీడ్‌గా కూల్ చేయడమే కాకుండా తక్కువ కరెంటును వినియోగిస్తుంది. కాబట్టి మీరు తక్కువ కరెంటు బిల్‌ రావాలన్నా, ఎలాంటి సౌండ్ లేకండా ఉండాలన్న డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ బెటర్‌గా ఉండొచ్చు!

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us