Hydroponics Farming: జర్నలిస్ట్ నుంచి రైతుగా మారిన వైనం.. భవనంపైనే వ్యవసాయం.. ఏడాదికి 70 లక్షల ఆదాయం

|

Jun 15, 2022 | 10:43 AM

రామ్‌వీర్ సింగ్ స్నేహితుడి మేనమామకు 2009లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ బారిన పడడానికి కారణం కెమికల్‌తో కూడిన కూరగాయల వలన అని పరిశోధనలో తెలిసింది. దీంతో రామ్‌వీర్ సింగ్ లో భయం మొదలైంది.

Hydroponics Farming: జర్నలిస్ట్ నుంచి రైతుగా మారిన వైనం.. భవనంపైనే వ్యవసాయం.. ఏడాదికి  70 లక్షల ఆదాయం
Hydroponics Farming
Follow us on

Hydroponics Farming: ఒక సంఘటన చాలు మనిషి జీవితాన్ని మార్చివేయడానికి.. తమ జీవితంలో జరిగే సంఘటనలతో కొందరు.. నిరాశకు గురైతే.. మరికొందరు స్ఫూర్తిగా తీసుకుని తమ జీవన విధానాన్ని మార్చుకుంటారు. తమకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) బరేలీకి(Bareli) చెందిన రాంవీర్ సింగ్‌కు(Ram Veer Singh) కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు.. ఇప్పుడు ఆధునిక పద్ధతిలో పంటలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్నాడు.

జర్నలిస్ట్ నుంచి రైతుగా ఎందుకు మారడంటే? 
రామ్‌వీర్ సింగ్ స్నేహితుడి మేనమామకు 2009లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ బారిన పడడానికి కారణం కెమికల్‌తో కూడిన కూరగాయల వలన అని పరిశోధనలో తెలిసింది. దీంతో రామ్‌వీర్ సింగ్ లో భయం మొదలైంది. తన కుటుంబాన్ని అలాంటి ప్రమాదాల నుండి కాపాడాలని నిర్ణయించుకున్నాడు.

ఫుల్‌టైమ్ జర్నలిస్ట్ అయిన రామ్‌వీర్ సింగ్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన పూర్వీకులు ఇచ్చిన భూమిలో సేంద్రీయ కూరగాయలను పండించాలని నిర్ణయం తీసుకున్నాడు. “పొలం బరేలీ నుండి 40 కి.మీ దూరంలో ఉంది. దీంతో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. వృత్తిగా వ్యవసాయ దారుడిగా మారి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో వ్యవసాయం:
2017-18లో రామ్‌వీర్ సింగ్ వ్యవసాయ సంబంధిత కార్యక్రమంలో భాగంగా దుబాయ్‌లో హైడ్రోపోనిక్స్ వ్యవసాయాన్ని అభ్యసించాడు. ఈ వ్యవసాయ పద్ధతికి నేల అవసరం లేదని, తక్కువ కీటకాలతో సాగు చేయవచ్చని తెలుసుకున్నాడు. అంతేకాదు మొక్కల పెరుగుదలకు అవసరమైన నీటిలో దాదాపు 80% ఆదా అవుతుందని తెలిసి సంతోషించాడు. దీంతో అక్కడే  రెండు వారాల పాటు రైతుల నుండి వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్నాడు.

రామ్‌వీర్ సింగ్ స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత తన ఇంట్లో వ్యవసాయ పద్ధతులతో కూరగాయలను  పండించడం ప్రయత్నించాలనుకున్నాడు. హైడ్రోపోనిక్స్ పొలాల పట్ల మక్కువతో వ్యవసాయం మొదలు పెట్టిన రామ్‌వీర్ సింగ్ ఇప్పుడు తన మూడంతస్తుల భవనాన్ని హైడ్రోపోనిక్స్ ఫామ్‌గా మార్చేశాడు. ఓ వైపు ఆరోగ్యకరమైన కూరగాయలను పొందుతూనే మరోవైపు ఏడాదికి లక్షల రూపాయలను ఆదాయంగా పొందుతున్నాడు.

మూడంతస్తులభవనం హైడ్రోపోనిక్స్ ఫామ్‌: 
తన భవనంలోని బాల్కనీలు , పైపులు , ఇతర పరికరాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాలలో హైడ్రోపోనిక్స్ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఇందుకు న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ (NFT), డీప్ ఫ్లో టెక్నాలజీని ఉపయోగించాడు ఇప్పుడు 750 చదరపు మీటర్లలో 10,000 మొక్కలతో  వ్యవసాయం చేస్తున్నాడు.

బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికమ్, సీసా పొట్లకాయ, టమోటాలు, క్యాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, స్ట్రాబెర్రీలు, మెంతులు , పచ్చి బఠానీలు అతను పండించే కొన్ని కూరగాయలు.

“తాను సీజనల్ పంటలను పెంచడానికి హైడ్రోపోనిక్స్‌ని ఉపయోగిస్తాను. ఈ వ్యవస్థ PVC పైపులతో రూపొందించబడింది. గురుత్వాకర్షణ ద్వారా నీటి ప్రసరణ పనిచేస్తుందని చెప్పారు. మెగ్నీషియం, రాగి, భాస్వరం, నైట్రోజన్, జింక్ వంటి ఇతర 16 రకాల పోషకాలను ప్రవహించే నీటిలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా మొక్కలకు చేరతాయని.. “ఈ ప్రక్రియ ద్వారా 90%  నీటి వినియోగాన్ని ఆదా చేస్తుంది,” అని ఆయన వివరించారు.

 హైడ్రోపోనిక్స్ వ్యవసాయ పద్దతి మంచిదేనా?
సేంద్రియ వ్యవసాయం కంటే హైడ్రోపోనిక్ వ్యవసాయం ఆరోగ్యకరమైనది, ప్రభావవంతమైనది అని రామ్‌వీర్ అభిప్రాయపడ్డారు . “హైడ్రోపోనిక్స్‌లో పండించిన కూరగాయలు అధిక పోషకాహార శోషణ రేటును కలిగి ఉంటాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా రసాయనిక వ్యవసాయం వలన నేల కలుషితమయ్యే ప్రమాదం ఉందని.. అదే “హైడ్రోపోనిక్స్ వ్యవసాయంలో అటువంటి ప్రమాదం లేదని పేర్కొన్నాడు.

అతని అద్భుతమైన, ప్రత్యేకమైన భవనం అటుగా వెళ్లే ప్రయాణీకులను ఆకర్షిస్తుంది. కాంక్రీట్ భవనం అంచుల మీద వేలాడుతున్న కూరగాయలతో వింత సోయగంతో చూపరులను ఆకట్టుకుంది. వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ ఎంటర్‌ప్రైజ్‌ను స్థాపించిన రామ్‌వీర్ ఇప్పుడు సంవత్సరానికి రూ.70 లక్షల ఆదాయాన్ని పొందుతున్నాడు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..